Home » కులం గురించి మాట్లాడ‌క‌పోతే న‌రుకుతామ‌న్నారు..జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

కులం గురించి మాట్లాడ‌క‌పోతే న‌రుకుతామ‌న్నారు..జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

హీరోగా విల‌న్ రానించడం చాలా క‌ష్టం. కానీ ఆ రెండు వేరియ‌షన్స్ ను చూపించిన న‌టులు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. ఆ లిస్ట్ లో జ‌గ‌ప‌తిబాబు ఒక‌రు. ఒక‌ప్పుడు జ‌గ‌ప‌తిబాబు హీరో వంద‌ల సినిమాల్లో న‌టించాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఎక్కువగా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ సినిమాల్లోనే న‌టించాడు. కానీ హీరోగా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేక‌పోయాడు. కానీ ఆ త‌ర‌వాత విల‌న్ గా ఎంట్రీ ఇచ్చి మాత్రం ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టేశాడు.

Advertisement

లెజెండ్ సినిమాలో మొద‌టిసారి విల‌న్ గా న‌టించి ఆ సినిమాలో మాస్ డైలాగ్ లు ఫైట్ ల‌తో అద‌ర‌గొట్టాడు. కేవ‌లం విల‌న్ గానే కాకుండా పాజిటివ్ రోల్స్ లోనూ నటిస్తున్నాడు. హీరోకు తండ్రి పాత్ర‌లు మ‌రియు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం ఎక్కువ‌ విల‌న్ గా వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నాడు.

Advertisement

తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ జ‌గ‌ప‌తిబాబు సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే జ‌గ‌ప‌తిబాబు ముందు నుండి ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు. సినిమాల్లో ఎలాంటి పాత్ర‌లు చేసినా నిజ జీవితంలో తాను అనుకున్న‌ది చెబుతూ అదే ఆచ‌రిస్తాడు కూడా. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌ప‌తిబాబు సంచల‌న వ్యాఖ్య‌లు చేశాడు. విజ‌య‌వాడ‌లోని సిద్దార్థ్ కాలేజీలో తాను ఓ ఈవెంట్ కు వెళ్లాన‌ని చెప్పారు.

Jagapati babu

Jagapati babu

ఆ ఈవెంట్ కు వెళ్లిన‌ప్పుడు కులం గురించి తాను మాట్లాడ‌న‌ని ప్రిన్సిప‌ల్ తో ముందుగానే చెప్పాన‌ని అన్నారు.కానీ ఆ ప్రిన్సిప‌ల్ ఆడిటోరియంలో 2000 మంది విద్యార్థులు ఉంటారు. వారంతా ఒకే కులానికి చెందిన‌వారు..కులం గురించి మాట్లాడ‌క‌పోతే వారు మిమ్మ‌ల్ని ముక్కులుగా న‌రికేస్తార‌ని హెచ్చ‌రించార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తిబాబు చేసిన కామెంట్ లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

also read : Dasara : దసరా నుంచి ‘ఓరి వారి’ సాంగ్…దుమ్ములేపిన నాని

Visitors Are Also Reading