మెగా ఫ్యామిలీ ఈ ఏడాది పెద్ద పండగ వాతావరణం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసనకు బేబీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. గత నెలలో నామకరణం ఈవెంట్ కూడా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు.
Advertisement
మెగా వారసురాలకి వచ్చిన గిఫ్టులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలికి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారు అనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు. తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ దంపతులు తమ మనవరాలు క్లీంకారకు ఆంజనేయస్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్ ను అందమైన డిజైన్ తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించింది. మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Advertisement
అందుకే తన మనవరాలకి ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్ లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రెగ్నెన్సీ జర్నీ పై ఉపాసన మాట్లాడుతూ.. ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తలడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులు ఉండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు అని అన్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Health tips : జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి చాలు..!
చంద్రముఖి చిత్రంలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?
మహేష్ సినిమా ఎంట్రీ వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?