Home » చిరంజీవి… వెంకటేష్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ ఎదో తెలుసా..?

చిరంజీవి… వెంకటేష్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ ఎదో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి కాలంలో స్టార్ హీరోలుగా కొనసాగిన ఎంతోమంది మల్టీస్టారర్ మూవీలలో హీరోలుగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి ఒకే తరం స్టార్ హీరోలు ఎన్నో మల్టీ స్టారర్ మూవీలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సమయంలో ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలు రాలేదు.

chiranjeevi-and-venkatesh-photos

chiranjeevi-and-venkatesh-photos

 

చాలా సంవత్సరాల పాటు మల్టీ స్టారర్ మూవీలను తెరపడిన సమయంలో విక్టరీ వెంకటేష్… మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీలో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మల్టీ స్టారర్ మూవీలు రూపొందాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవి… వెంకటేష్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీ మిస్ అయింది అనే విషయం మీకు తెలుసా.

Advertisement

Advertisement

అసలు విషయంలోకి వెళదాం … బాలీవుడ్ లో అమిర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో “అందాజ్ అప్నా అప్నా” అనే మల్టీస్టారర్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఇదే మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి… విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీల తీయాలి అని ఈవివి సత్యనారాయణ ప్లాన్ చేశాడట.

అందులో భాగంగా ఈ ఇద్దరు హీరోలకు కథను కూడా వినిపించగా… వీరు కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే విరు అదే సమయంలో ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల చాలా రోజులు ఈ సినిమా డిలే అవడంతో మెల్లిగా ఈ సినిమా క్యాన్సల్ అయ్యిందట. అలా చిరంజీవి… వెంకటేష్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ మిస్ అయ్యిందట.

Visitors Are Also Reading