Home » రెండు నెలలైనా పచ్చిమిర్చి ఫ్రెష్ గానే ఉండాలంటే… ఇలా చేయండి…!

రెండు నెలలైనా పచ్చిమిర్చి ఫ్రెష్ గానే ఉండాలంటే… ఇలా చేయండి…!

by Sravya
Ad

ఎక్కువ పచ్చిమిర్చి మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే, పాడైపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటిని బాగా స్టోర్ చేసుకోవాలని అనుకుంటుంటారు. కానీ పాడైపోతూ ఉంటాయి ఇలా కనుక మీరు పచ్చిమిరపకాయలని స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం అవి పాడైపోకుండా ఉంటాయి. రెండు నెలల వరకు పచ్చిమిరపకాయలు పాడైపోకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం పచ్చిమిర్చిని వాడుతూ ఉంటాము. పచ్చిమిర్చి ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము.

Advertisement

పచ్చిమిర్చి ఎక్కువ కాలం పాటు ఫ్రెష్ గా ఉండాలంటే ముందు వాటిని బాగా కడిగి ఆరబెట్టుకోండి. మిర్చి తొడాలు తీసేయాలి ఎందుకంటే ఇవి ఉండడం వలన తేమని పీల్చుకుని మెత్తబడిపోయి ఇలా చేసేస్తాయి. అందుకే పాడైపోతాయి. కాబట్టి తొడాలను తీసేసి గాలి చొరబడిన డబ్బా తీసుకుని కింద టిష్యూ పేపర్ వేసి మిర్చిని వాటి మీద వేయండి ఇప్పుడు మళ్లీ ఇంకో టిష్యూ పేపర్ ని తీసుకుని పచ్చిమిర్చి పైన కూడా వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి.

Advertisement

పచ్చిమిర్చి నిల్వ ఉండడానికి టిష్యూ పేపర్స్ ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వలన రెండు నెలలైనా కూడా పాడైపోకుండా, పచ్చిమిరపకాయలు ఫ్రెష్ గా ఉంటాయి. ఇక ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు పచ్చిమిరపకాయల్ని స్టోర్ చేసుకోవచ్చు. నిమ్మకాయలను స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ని తీసుకుని టిష్యూ పేపర్ వేసి నిమ్మకాయ వేసి పైన మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ వేయండి. లేదంటే మీరు టిష్యూ పేపర్లో నిమ్మకాయల్ని చుట్టేసి జిప్ లాక్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే రెండు నెలలైనా కూడా పాడవ్వవు. ఫ్రెష్ గా ఉంటాయి.

Also read:

Visitors Are Also Reading