Home » “వినయ విధేయ రామ” లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

“వినయ విధేయ రామ” లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on

రామ్ చరణ్ హీరో గా నటించిన వినయ విధేయ రామ సినిమా గుర్తుందా? రంగస్థలం తరువాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా ఇదే. బోయపాటి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే.. ఈ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రలో నటించిన బుడ్డోడు మాత్రం చాలా పాపులర్ అయిపోయాడు.

రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ పోషించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రోషన్. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఈ బుడ్డోడిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను అని ఆ బుడ్డోడి చెప్పే డైలాగ్ హైలైట్. అంత చిన్న వయసులో అతని ఎక్స్ప్రెషన్స్ కూడా నాచురల్ గా అనిపిస్తాయి. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా. బోయపాటికి కజిన్ కొడుకు. రోషన్ రాయ్ కు కెమెరా ముందుకు రావడం అంటే సరదానట. అందుకే ఈ సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు. కానీ మనోడు జీవించేసాడు. దానితో వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత కల్యాణ వైభోగమే అనే సీరియల్ లో కూడా రోషన్ నటించి అందరి మెప్పు పొందుతున్నాడు. ఈ సీరియల్ లో చారుకేశ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఇదే కాకుండా కొన్ని టాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. అయితే ఈ బుడ్డోడు బోయపాటికి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ బుడ్డోడికి ఇంకా ఛాన్సెస్ రావాలని, సినిమాల్లో యాక్టింగ్ ఇరగదీయాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Visitors Are Also Reading