Home » విజయ్ సేతుపతికి షాక్.. కోర్టు నుంచి సమన్లు

విజయ్ సేతుపతికి షాక్.. కోర్టు నుంచి సమన్లు

by Bunty
Ad

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి షాకిస్తూ చెన్నై కోర్టు నోటీసులు పంపింది. చూస్తుంటే ఆయనను ఆ విమానాశ్రయం ఘటన వదిలేలా కన్పించడం లేదు. ముహూర్తాన బెంగుళూరు విమానాశ్రయంలో పెట్టాడో గానీ ఆ ఘటన మాత్రం ఆయనను పట్టుకుని శనిలా వేధిస్తోంది. తాజాగా మహా గాంధీ చేసిన ఫిర్యాదు మేరకు విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్‌లకు చెన్నైలోని సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు ​​జారీ చేసింది.

Advertisement

Advertisement

సమాచారం ప్రకారం విమానాశ్రయంలో నటుడి బృందం తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ మహా గాంధీ చేసిన ఫిర్యాదు మేరకు విజయ్‌ ను విచారణకు పిలిచారు. నవంబర్ 2 న సేతుపతి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత ఢిల్లీ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా, అతని బృందం, మహా గాంధీ మధ్య ఘర్షణ జరిగింది. వాస్తవానికి విమానాశ్రయంలో నటుడిపై గాంధీ దాడికి ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. వాగ్వాదం తర్వాత విమానాశ్రయం వెలుపల విజయ్ మేనేజర్ తనపై దాడి చేశాడని మహా గాంధీ చెన్నై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్‌తో పాటు అతని మేనేజర్‌కి నోటీసులు పంపిన కోర్టు.. జనవరి 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఇక ఈ వివాదంపై అప్పట్లో స్పందించిన సేతుపతి ఇది చిన్న విషయమని కొట్టిపారేశారు. అంతే కాకుండా ఈ విషయాన్నీ మీడియా పెద్దది చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన మండి పడ్డారు.

Visitors Are Also Reading