Home » CHATRAPATI REVIEW : ఛ‌త్ర‌ప‌తి రివ్యూ…బెల్లంకొండ బాలీవుడ్ లో హిట్ కొట్టాడా..?

CHATRAPATI REVIEW : ఛ‌త్ర‌ప‌తి రివ్యూ…బెల్లంకొండ బాలీవుడ్ లో హిట్ కొట్టాడా..?

by AJAY
Ad

ప‌రిచ‌యం:

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛ‌త్రపతి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇదే సినిమాను బాలీవుడ్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. తాజాగా మే 12న ఈ సినిమా విడుదల అయింది. సినిమా ట్రైలర్ టీజ‌ర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఛ‌త్రపతి సంచలన విజయం సాధించడంతో హిందీ రీమేక్ పై కూడా అంచనాలు నెలకొన్నాయి. వివి వినాయక్ రాజమౌళి సినిమాను హ్యాండిల్ చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. మరి అంచ‌నాల‌ను రీచ్ అయ్యాడా. బెల్లంకొడ‌కు బాలీవుడ్ లో హిట్ ప‌డిన‌ట్టేనా అన్న‌ది ఈ రివ్యూలో చూద్దాం..

Advertisement


కథ :
భాగ్యశ్రీ అనే మహిళ కు ఇద్దరు కుమారులు ఉంటారు. అయితే వారిలో అశోక్ సొంత కుమారుడు కాగా శివ ను భాగ్య శ్రీ దత్తత తీసుకుంటుంది. అయితే అనుకోకుండా వచ్చిన ఉప్పెన‌ వల్ల శివ తల్లి మరియు తమ్ముడు నుంచి దూర‌మైపోతాడు. శివ చిన్ననాటి నుండి తన తల్లిని త‌లుచుకుంటూ ఆమెను క‌లుసుకోవ‌ల‌నే ల‌క్ష్యంతో జీవనం సాగిస్తుంటాడు. ఇక బ్ర‌తకండం కోసం చిన్న‌నాటి నుండి కూలిగా ప‌నిచేస్తుంటాడు. ఈ క్రమంలో విలన్ తో గొడవలు జరుగుతాయి. ఆ గొడవల్లో ఏం జరిగింది..? శివ చివరికి తల్లిని కలిసాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.

ALSO READ:చిరంజీవిని తీసేసి ఆ హీరోను పెట్టుకోమని దాసరి గారు అన్నారు..!

Advertisement


విశేషణ:

సినిమా ట్రైలర్ లో చూపించినట్టుగా యాక్షన్ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. వివి వినాయక్ ఫైట్ ల‌ను చాలా స్టైలిష్ గా తెర‌కెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో బెల్లంకొండ ఇరగదీశాడు. విజువల్ గా సినిమాలోని యాక్ష‌న్ సీన్ లు చూడడానికి ఎంతో బాగుంది. అయితే ఇప్పటికే ఛ‌త్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే తెర‌కెక్కించ‌డం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సీన్లలో బెల్లంకొండ నెవర్ బిఫోర్ గా నటించాడు.

హీరోయిన్ నుస్ర‌త్ బ‌రుచ్చా కు పెద్దగా స్క్రీన్ ప్రెసెన్స్ దక్కలేదు. కేవలం సినిమా పాటల్లో మరియు కొన్ని సీన్ ల‌లో మాత్రమే కనిపించింది. బెల్లంకొండకు తమ్ముడిగా నటించిన న‌టుడు త‌మ పాత్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇత‌ర తారాగ‌ణం కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ ఛ‌త్ర‌ప‌తి ఒక‌ అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. యాక్షన్ సీన్ లు త‌ప్ప సినిమా క‌థ‌లో ప‌స లేదు.

also read:Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?

Visitors Are Also Reading