Home » “ఛత్రపతి” సినిమా సూరీడు గుర్తున్నాడా…? ఇప్పుడు ఎంత మారిపోయాడో చూడండి…!

“ఛత్రపతి” సినిమా సూరీడు గుర్తున్నాడా…? ఇప్పుడు ఎంత మారిపోయాడో చూడండి…!

by AJAY
Ad

సినిమాలలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతారు. అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ ల లిస్ట్ లో ఛత్రపతి సినిమా లో సూరీడు పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంతటి భారీ విషయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. ఇక ప్రభాస్ ను హైలెట్ చేసే ఒక సీన్ లో సూరీడు అనే పాత్ర కనిపిస్తుంది. కళ్ళులేని తన తల్లి సూరీడు సూరీడు అంటూ పిలుస్తూ వెతుకుతుంటే కాట్రాజ్ వచ్చి ఆ పిల్లవాడిని చావబాది కింద పడేస్తాడు. అప్పుడు ప్రభాస్ వచ్చి పిల్లాడిని రక్షిస్తాడు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

Advertisement

ఇక ఈ సీన్ లో తన నటనతో మెప్పించిన కుర్రాడి పేరు భశ్వంత్. చత్రపతి సినిమా తర్వాత భశ్వంత్ గుర్తిండిపోయే సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులు సూరీడు పాత్రను మాత్రం మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ సూరీడు అనే పేరుతో సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ పాత్ర ప్రేక్షకుల పై ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే సూరీడు పాత్రలో నటించిన భశ్వంత్ ప్రస్తుతం పెరిగి పెద్దవాడయ్యాడు. అంతేకాకుండా చూడ్డానికి హీరోలా అందంగా మారిపోయాడు. ప్రస్తుతం భశ్వంత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading