ఆచార్య చాణక్యుడు గొప్ప సలహాదారుగా, వ్యూహకర్తగా, తత్వవేత్తగా పరిగణించబడ్డాడు. వేదాలు మరియు పురాణాలపై పూర్తి జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి చాణక్యుడు. ఆయన అందించిన జ్ఞానం ఆధారంగా మానవ జీవితానికి సంబంధించిన అనేక ఆచరణాత్మక విషయాలను చెప్పారు. చాణక్య నీతి ( chanikya niti )ద్వారా మనిషి ఈ 4 విషయాలను సమర్ధిస్తే అతని చుట్టూ ఎప్పుడూ కష్టాలు ఉంటాయని చెప్పబడింది. ఆచార్య చాణక్యుడు దూరంగా ఉండమని సూచించిన ఈ 4 విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
Advertisement
#1.మూర్ఖుడైన శిష్యుడికి ఉపదేశించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆచార్య చాణక్యుడు నమ్ముతాడు. ఇక్కడ మూర్ఖుడైన శిష్యుడు అంటే.. వాళ్ళ ఎవరి మాటా వినరు. ఎవరి మాట వినని వారికి ఏ విధమైన జ్ఞానాన్ని అందించడం వారి సమయాన్ని వృధా చేసినట్లే అవుతుంది. అలాంటి మూర్ఖులను అనుసరించి సమయాన్ని వృధా చేసేవారికి ఎల్లప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి.
#2.చాణక్య నీతి ప్రకారం ఇతరులకు సహాయం చేయడం మంచి విషయమే, అయితే ఇతరుల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి, అసూయపడే దుష్ట ప్రవర్తన కలిగిన వారిని దూరంగా ఉంచాలి. అలాంటి వారు ఇంట్లో కష్టాలను రెట్టింపు చేస్తారు. మీరు వారిపై దయ కలిగి ఉంటే, వారు మీ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులకు హాని చేయవచ్చు. కాబట్టి ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల పట్ల కనికరం చూపకండి.
Advertisement
#3. నిత్యం దుఃఖంలో మునిగితేలుతూ, ప్రతి విషయంలోనూ విధిని, భగవంతుడిని నిందించే వారికి దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు తమతో ఎన్నటికీ సంతృప్తి చెందరు. ఇతరులను సంతృప్తి పరచడానికి అనుమతించరు. మీరు వారితో కలిసి ఉంటే, ఈ వ్యక్తులు కూడా మిమ్మల్ని ప్రతికూల ఆలోచనలతో నింపుతారు. అలాంటి వారిని కూడా మీ దగ్గరికి రానివ్వకూడదు.
#4. దురాశతో ఎదుటివారి సొమ్మును ఆశించే వాడిని ఇప్పుడు కూడా మీ దగ్గరకు రానివ్వొద్దని చాణిక్యుడు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న విలువైన సంపదను సొంతం చేసుకోవడం కోసం వారు మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. అలాంటి వ్యక్తులను ముందుగానే పసిగట్టి దూరంగా ఉంచడం మేలని చాణిక్యుడు వివరిస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
CHANAKYA NITI : మీరు నమ్మే వ్యక్తులకు ఈ 4 లక్షణాలు ఉన్నాయో లేదో చూడండి
ఈ విషయాల్లో మగవారి కంటే ఆడవారే గొప్పవారట..? ఎందులో అంటే..?
CHANAKYA NITI : ఇలాంటి స్త్రీ వల్ల మీ జీవితం నాశనం.. దూరంగా ఉండటం ఉత్తమం..!