ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇంటర్‌నెట్ వినియోగించే వారిలో సగానికి పైగా ఫేస్‌బుక్ వాడుతున్నారనే చెప్పవచ్చు. బ్లూ కలర్‌లో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇక నుంచి మనకు కనిపించదు. రాబోయే రోజుల్లో సెర్చ్ ఇంజన్లలో ఫేస్‌బుక్ అని టైప్ చేస్తే పేజీలు దొరకవు. ఎందుకు అంటే ఇకపై ఫేస్‌బుక్ స్థానంలో మెటా కనిపించనున్నది.
ఇక హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే మార్క్ జుకర్ బర్గ్ ఫేస్‌బుక్‌ను 2004లో ప్రారంభించాడు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి స్మార్ట్‌ఫోన్‌లలో ఓ భాగం అయింది ఫేస్‌బుక్. మనం చూస్తున్న ఫేస్‌బుక్ లోగో, టిక్కర్ అంతా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లినప్పుడు డిజైన్ చేసింది. గడిచిన పదేళ్లుగా ఈ లోగో, టిక్కర్ తో ఫేస్‌బుక్ కనిపిస్తోంది. ఇకపై ఇది కనుమరుగు కానున్నది. ఫేస్‌బుక్‌తో ప్రయాణం ప్రారంభించిన మార్క్ జుకర్‌బర్గ్ ఆ తరువా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ గా ఫేస్‌బుక్‌ను తీర్చిదిద్దారు.
Advertisement
Advertisement
ఇక అంతటితో మార్క్ ప్రణాళికలు మాత్రం ఆగిపోలేదు. వాస్తవ ప్రపంచానికి దీటుగా టెక్నాలజీ సాయంతో మరొక మాయ ప్రపంచానికి రూపకల్పన చేసాడు. దానికి మెటావర్స్‌గా పేరు పెట్టాడు. మెటాపై నమ్మకంతో ఫేస్‌బుక్ కంపెనీ పేరు కూడా మెటా 2021 అక్టోబర్‌లోనే మార్చేశాడు. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలకు చేరువైన ఫేస్‌బుక్ టికర్, లోగోలను ఇప్పుడు మార్చితే ఏమౌతుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలోనే టికర్ మార్పు ప్రకటన అనంతరం మెటా షేర్ల విలువకు 6శాతం మేర కోత పడింది. జుకర్ బర్గ్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గుతారేమో వేచి చూడాలి మరి.
Also Read :
నయనతార పెళ్లిపై రోజా ఏమన్నారో తెలుసా..?
పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య ఎంత ఉందంటే..?