టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో ఇప్పటికే ఒక సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండియాలో ఉన్న టాక్ షోలన్నింటికంటే నెంబర్ వన్ గా నిలిచింది అన్ స్టాపబుల్. తాజాగా సీజన్ 2 ప్రారంభమైంది. మొదటి సీజన్ మాదిరిగానే రెట్టింపు ఉత్సాహంతో రానున్న అన్ స్టాపబుల్ 2 షోకు మొదటి గెస్ట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ షో కు సంబంధించిన ప్రోమో లో చంద్రబాబును 1995లో జరిగిన విషయం గురించి అడిగారు. అయితే ప్రోమోలో అంత క్లియర్ గా వివరించక పోయినప్పటికీ.. ఇవాళ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో చంద్రబాబు 1995లో జరిగిన విషయం గురించి స్పందించారు.
Advertisement
చంద్రబాబు మాట్లాడుతూ.. నా హయాంలో నేను నాయకుల్ని గౌరవించి వారి పేర్లు అనేక సంస్థలకు పెట్టాను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేయడం తెలుగువారిని అవమానించడం. కడప జిల్లాకి వైఎస్సార్ పేరు మార్చలేదు. ఏడాదిన్నర తర్వాత మా ప్రభుత్వం మళ్ళీ వచ్చాక హెల్త్ వర్సిటీ కి తిరిగి పేరు పెడతాను అని చెప్పారు చంద్రబాబు. 1995 పార్టీలో కొన్ని సమస్యల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. బీవీ మోహనరెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణతో కలిసి ఆ రోజు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాను. ఆయనను బతిమాలాను, కాళ్లు పట్టుకున్నాను.. ఒక మీటింగ్ పెట్టి డిస్కస్ చేయమన్నాను. ఎన్టీఆర్‌తో ముందుకు పోవాలనే తొలుత అనుకున్నాం. కానీ విరుద్ధమైన నిర్ణయమే తీసుకున్నాం. ఆరోజు మొత్తం ఐదుగురం కలిసి నిర్ణయం తీసుకున్నాం.
Advertisement
Also Read : పూనమ్ కౌర్‌కి పెళ్లి అయిందా..? అందుకే అలా చేసిందా ?
ఎన్టీఆర్ మీద బయటి నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇంప్ల్యూయెన్స్ పెరిగిపోయిందన్నారు చంద్రబాబు. ఇదే విషయంపై బాలకృష్ణ మాట్లాడుతూ.. 1995లో తీసుకున్న నిర్ణయం ఏమీ తప్పు కాదు. నందమూరి కుటుంబం, నారా కుటుంబం కలిసి తీసుకున్న నిర్ణయంలో ఏ తప్పు లేదు అని అన్నారు బాలకృష్ణ. ఒక నందమూరి కుటుంబ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెబుతున్నాను మీరు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అన్నారు బాలకృష్ణ. అలాగే ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పు కాదని 1999 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఆ నిర్ణయం.. అందరం కలిసి తీసుకున్న నిర్ణయం.. ఆ రోజు ఎన్టీఆర్ తో మాట్లాడటానికి వెళ్ళిన ఐదుగురిలో నేను ఉన్నాను అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.