తెలుగు నాట రాజకీయాల్లో రాణించిన వారిలో చంద్రబాబు కూడా ఒకరు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా మళ్లీ అంతటి గుర్తింపును చంద్రబాబు దక్కించుకున్నారు. తన పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబు విద్యార్థి దశలోనే రాజకీయాల పైన ఆసక్తి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
Advertisement
అంచలంచలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నా వైసిపి కి ప్రతిపక్షం గా ఉన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ పదవ తేదీన చంద్రబాబు భువనేశ్వరి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Advertisement
ఈ పెళ్లి పత్రిక లో చంద్రబాబు… ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకుంటున్నానని అందరూ తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నట్టు గా కనిపిస్తోంది. ఇక ఈ పెళ్లి నాటికి ఎన్టీఆర్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవిలో ఉన్నారు. దాంతో అప్పట్లో వీరి పెళ్ళికి ఎంతో క్రేజ్ వచ్చింది. అన్ని ప్రముఖ మీడియాలలోనూ పెళ్లి గురించి వార్తలు వచ్చేవి. చంద్రబాబు భువనేశ్వరి పెళ్లి కి సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మరోవైపు అప్పట్లో చంద్రబాబు అంత కష్టం తీసుకున్నారు…. ఇంత కట్నం తీసుకున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ నిజానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదట. ఎన్టీఆర్ కూడా కట్నం ఇస్తానని చెప్పలేదట. అలా కట్నం ప్రస్తావన లేకుండానే చంద్రబాబు భువనేశ్వరి వివాహం జరిగింది. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటో మరియు ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో అభిమానులు పత్రిక, ఫోటో చూసి సంబరపడిపోతున్నారు.