Telugu News » Blog » వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి పై బండ్ల గణేష్ ఫైర్….నువ్వు ఆంధ్రాకు పట్టిన దరిద్రం అంటూ ఘాటు వ్యాఖ్యలు …!

వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి పై బండ్ల గణేష్ ఫైర్….నువ్వు ఆంధ్రాకు పట్టిన దరిద్రం అంటూ ఘాటు వ్యాఖ్యలు …!

by AJAY
Ads

టాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ విశాఖ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పై వ‌రుస ట్వీట్ల‌తో రెచ్చిపోయారు. మీకు కులం నచ్చకుంటే …కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి … చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండని బండ్ల గ‌ణేష్ పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని… రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు అంటూ రెచ్చిపోయారు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదని….నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదని బండ్ల గ‌ణేష్ పేర్కొన్నారు.

Ads

అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని అన్నారు. నువ్వు పెద్ద దరిద్రానివి….మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లో కి లాగుతున్నవ్ …కెసిఆర్ ను చూసి నేర్చుకో అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారంటూ బండ్ల గ‌ణేష్ స‌ల‌హా ఇచ్చారు.

Ads

చంద్రబాబు తో ఉంటే ఆయనతో తేల్చుకో… విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు అంటూ బండ్ల గ‌ణేష్ ఫైర్ అయ్యారు. నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు కానీ కులాన్ని కాదు…నిన్ను జైల్ కు పంపింది… కమ్మ వారు కాదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి…ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు….అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా అంటూ బండ్ల గ‌ణేష్ పేర్కొన్నారు.

Ad

కమ్మ వారిని తిట్టాడా న్ని తట్టుకోలేక పోతున్నా…నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు ..దయచేసి కులాన్ని తిట్టకు…ఇదేనా నీ సంస్కారం ? నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు…ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నవు అంటూ బండ్ల ఫైర్ అయ్యారు.