స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే…చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడని వెల్లడించారు. ఈ కేసులో 550 కోట్ల స్కాం జరిగింది అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేసామని ప్రకటించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఇవాళ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశామని..ఈ స్కాం లో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడన్నారు.
విచారణలో మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ చాలా అవసరమని వెల్లడించారు. లోకేష్‌ని కూడా విచారించాల్సి ఉంటది. లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటామని కూడా ప్రకటించేశారు ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్. చంద్రబాబు పాత్ర ఉందన్నది స్పష్టం అని… ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయని పేర్కొన్నారు. తగిన ఆధారాలను కోర్టు ముందు పెడతామని.. ఈ స్కాం లో లబ్దిదారుడు చంద్రబాబు అని తెలిపారు. డిజైన్ టెక్ నుంచి అనేక షెల్ కంపెనీలకు నిధులు వెళ్ళాయని.. కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు.
Advertisement
Advertisement
2014 లో జులై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… ఏర్పాటు కంటే ముందే డిజైన్ టెక్ తో ఒప్పందం కుదిరిందని చెప్పారు.క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని… డిజైన్ టెక్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ భాస్కర్ భార్య అపర్ణ ఉన్నారని చెప్పారు. ఈమెను కార్పొరేషన్ కు డెప్యూటీ సీఓ గా నియమించారు..ఈ ప్రజెంటేషన్స్ లో ఆమె కూడా పాల్గొన్నారని స్పష్టం చేశారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.
ఇవి కూడా చదవండి
Astrology: కలలో ఇవి కనిపించటం లక్ష్మీదేవి రాకకు సంకేతం..!
Mrunal Thakur : చిరంజీవి Mega-157లో మృణాల్ ఠాకూర్..?
Yogi Babu : యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది..హీరో కంటే ఎక్కువే !