Home » మనవడు దేవాన్ష్ ని పట్టుకొని.. ఏడ్చేసిన చంద్రబాబు.. బాలయ్య ఓదార్పు.. ఫొటోస్ వైరల్..!

మనవడు దేవాన్ష్ ని పట్టుకొని.. ఏడ్చేసిన చంద్రబాబు.. బాలయ్య ఓదార్పు.. ఫొటోస్ వైరల్..!

by Sravya
Ad

చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. దాదాపు 53 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడంతో, జైలు నుండి ఆయన బయటకి వచ్చారు. చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురవడం జరిగింది.

chandrababu

Advertisement

ఆయన బయటికి రాగానే కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీ నేతలు కూడా సాధారంగా స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుండి టిడిపి శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఏకంగా ఇసుకేస్తే రాలనంత జనం చేరిపోయారు. సుమారు 50 రోజుల తర్వాత కుటుంబ సభ్యుల్ని చూడడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Advertisement

ప్రధానంగా మనవడు దేవాన్ష్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలకి హత్తుకున్నారు చంద్రబాబు. ఇది చూసి పార్టీ శ్రేణులు ఆవేదనకి గురయ్యారు. చంద్రబాబు అరెస్టు జైలు విషయం గురించి మనవడు దేవాన్ష్ కి చెప్పలేదని నారా భువనేశ్వరి చెప్పింది వాస్తవమే. ఈ నేపథ్యంలో తాత బాలకృష్ణ తల్లి బ్రాహ్మణితో మంగళవారం సాయంత్రం రాజమండ్రి చేరుకున్న దేవాన్ష్ తాతని చూసి మురిసిపోయారు. అటు చంద్రబాబు కూడా మన వాడిని చూసి ఎంతో సంతోషపడ్డారు.

అతన్ని హత్తుకున్నారు ప్రస్తుతం టిడిపి సోషల్ మీడియాలో ఈ ఇమేజెస్ ని వైరల్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. బావ కాలికి నమస్కరించడం టిడిపి శ్రేణుల్ని ఆకట్టుకుంది. చంద్రబాబుకి బావమరిదే కాదు. వియ్యంకుడు కూడా. ముందు నుండి కూడా చంద్రబాబుతో బాలకృష్ణకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడూ విభేదించిన దాఖలు లేవు ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading