Home » Chandra Mohan : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. వివిధ అనారోగ్య కారణాల వల్ల చాలా మంది ప్రముఖులు మరణించారు. 2020 కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీకి మంచి మంచి సినీ నటులు దూరమయ్యారు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటులు, అలనాటి స్టార్ హీరో చంద్రమోహన్ ఇవాళ తుది శ్వాస విడిచారు.

Advertisement

హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఇవాళ ఉదయం 9:45 గంటలకు చంద్రమోహన్ మరణించారు. హృద్రోగంతో చంద్రమోహన్ మరణించినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. కాగా టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్ వయసు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర. ఆయనకు ఇద్దరు ఉ కుమార్తెలు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 సంవత్సరం మే 23వ తేదీ న చంద్రమోహన్ జన్మించారు.

Chandra Mohan

ఇక 1966 సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో… ఇండస్ట్రీలో అడుగు పెట్టారు చంద్రమోహన్. ఆ తర్వాత టాలీవుడ్ హీరోగా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఓ కమెడియన్ గా, అలాగే… తండ్రి పాత్రలలో కనిపించారు చంద్రమోహన్. హీరోగా 175 సినిమాల్లో నటించిన చంద్రమోహన్‌.. మొత్తం 932 సినిమాలు చేసారు. కాగా సోమవారం రోజున హైదరాబాద్ లో అంతక్రియలు జరగనున్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading