Home » Chandra Mohan : 100 కోట్లు ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్..మోసం చేశారా!

Chandra Mohan : 100 కోట్లు ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్..మోసం చేశారా!

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరో చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతతరం వారికి, కొత్తతరం వారికి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి చంద్రమోహన్ సుపరిచితమే. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. దాదాపు స్టార్ హీరోయిన్లందరూ చంద్రమోహన్ తో సినిమా చేయడానికి ఇష్టపడుతుండేవారు. అప్పట్లో హీరోయిన్లకు లక్కీ హీరోగా మారిపోయాడు చంద్రమోహన్. ఆయనతో సినిమా చేస్తే వారి కెరీర్ బాగుంటుందని భావించి అవకాశాల కోసం శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి హీరోయిన్లు పోటీపడేవారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేసేవారు.

Chandra Mohan lost property of 100 crores

ఇక కొన్ని రోజులకి తాను తండ్రి, పెద్దనాన్న, అన్న పాత్రలకి పరిమితమయ్యాడు. చంద్రమోహన్ దాదాపు 900కి పైగా చిత్రాల్లో నటించారు. ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ తనకి పెద్దగా ఆస్తులు లేవని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో ఓవైపు సినిమాలు చేస్తూనే వచ్చిన డబ్బుతో భారీగా స్థలాలు కొనుగోలు చేశాడట. హైదరాబాద్లోని కొంపల్లిలో దాదాపు 35 ఎకరాల ద్రాక్ష తోటను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆరు ఎకరాల భూమిని తమిళనాడు, చెన్నైలో దాదాపు 15 ఎకరాల విలువ చేసే భూమిని కొనుగోలు చేశారు. కానీ వాటిని మెయింటైన్ చేయలేక వాటన్నింటినీ కోల్పోయాడు. తన బిజీ షెడ్యూల్ వల్ల కొనుగోలు చేయడమే కానీ వాటిని కాపాడుకోలేకపోయాడు.

Advertisement

Advertisement

అలా చంద్రమోహన్ దాదాపు 100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని మీడియా ముందు వెల్లడించారు. జీవితంలో తాను తెలుసో తెలియకో చేసిన పొరపాటు ఇదేనంటూ బాధపడ్డారు. నేడు నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ మరణించడం చాలా బాధాకరం. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ నవంబర్ 11న ఉదయం 9:30 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనకు పలువురు సినీ ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading