Home » చంద్రమోహన్ ఎంతమంది హీరోయిన్స్ ని స్టార్స్ చేశారో తెలుసా..?

చంద్రమోహన్ ఎంతమంది హీరోయిన్స్ ని స్టార్స్ చేశారో తెలుసా..?

by Bunty
Ad

చంద్రమోహన్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఎనలేని విజయాలను అందుకున్నాడు. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ భాషచిత్రాల్లో కూడా సినిమాలు చేసేవారు చంద్రమోహన్. ఇక ఆ తర్వాత సినిమాల్లో హీరోగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.

Advertisement

అన్న, తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించాడు. పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ వంటి సినిమాలు చంద్రమోహన్ కెరీర్ ని మార్చేశాయి. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. చంద్రమోహన్ సరసన దాదాపు 60 మంది హీరోయిన్లు నటించారు. చంద్రమోహన్ తో సినిమా చేస్తే హీరోయిన్స్ కెరీర్ సెటిల్ అయ్యేది. ప్రతి ఒక్క హీరోయిన్ కి చంద్రమోహన్ లక్కీ హీరోగా మారిపోయాడు.

Advertisement

Chandra Mohan lost property of 100 crores

శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి హీరోయిన్లందరూ చంద్రమోహన్ తోనే తమ మొదటి సినిమాను ప్రారంభించి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనంత గొప్ప స్థాయికి ఎదిగారు. చంద్రమోహన్ సరసన నటించే అవకాశం ఏ హీరోయిన్ కి వచ్చినా కూడా వారు కాదని చెప్పేవారు కాదు. చంద్రమోహన్ దాదాపు 175 చిత్రాలు హీరోగా చేశారు. మొత్తం కలిపి చంద్రమోహన్ 900కు పైగా చిత్రాల్లో నటించారు. తన నటనకు గాను ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading