Home » ఆస్కార్ అవార్డు వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకు కాదు.. చంద్రబోస్ ఏమన్నారంటే..?

ఆస్కార్ అవార్డు వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకు కాదు.. చంద్రబోస్ ఏమన్నారంటే..?

by Anji
Ad

RRR చిత్రంలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో RRR భారతదేశ చలనచిత్ర రంగం స్థాయిని అమాంతం పెంచేసింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ కి అవార్డు లభించింది. ఆస్కార్ వేదికపై గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ దర్శకుడు కీరవాణి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకోకముందు పాట రాసిన చంద్రబోస్ ఓ వెబ్ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో చాలా భాషలున్నాయి. 

Also Read :  రాజమౌళి తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ని తీసుకోకపోవడానికి కారణం అదేనా ?

Advertisement

“అందులో కూడా తెలుగు భాషలో ప్రపంచ స్థాయిలో నేను రాసిన పాట ఆస్కార్ అనే ప్రతిష్టాత్మక అవార్డుకి నామినేట్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు రాజమౌళి కృషి.. డ్యాన్ చేసినటువంటి హీరోలు, అదేవిధంగా నృత్య దర్శకుడి కృషి ఉండవచ్చు. కానీ నాటు నాటు పాట ఆస్కార్ వరకు వెళ్లిందంటే.. దానికి ప్రధాన కారణం నాది కూడా ఉంది. దీనిని గర్వంగా చెప్పుకోవడం లేదు. నా యొక్క అదృష్టంగా చెప్పుకుంటున్నాను” అని తెలిపారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ రాయడానికి దాదాపు సంవత్సరం మీద 7 నెలల వరకు పట్టింది. మొత్తం 19నెలల సమయం తీసుకుంది. 

Advertisement

Also Read :  విజయశాంతి కోసం బాలకృష్ణ అంతటి త్యాగం చేశారా…?

దర్శకుడు రాజమౌళికి నచ్చేవిధంగా సంగీత దర్శకుడు కీరవాణి మెచ్చుకునేలా లక్ష్యంతో  దృఢ సంకల్పంతో ఈ పాట రాశాను. కానీ దర్శకుడు రాజమౌళికి కాకుండా.. సంగీత దర్శకుడు కీరవాణికి కాకుండా.. తెలుగు రాష్ట్రాలు, భారతదేశం కాకుండా, పక్క దేశం కాకుండా ఇతర ఖండాల్లోకి వెళ్లి విజయకేతనం ఎగురవేస్తుందని, “నేను కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా ఎర్రజొన్న రొట్టెలోనే మిరపతొక్కు కలిపినట్టు అనే లిరిక్స్ నాకు ఎంతగానో నచ్చింది. అది మన ఆహార సంస్కృతిని, వ్యవసాయ సంస్కృతిని, ఆర్థిక స్థితిని, శరీర సౌష్టాన్ని, గ్రామీణ నేపథ్యాన్ని తెలిపే వాక్యం ఇది. ఎన్టీఆర్ కూడా నామినేట్ అయినట్టు యాంకర్ ప్రశ్నించగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎవ్వరూ నామినేట్ కాలేదు. ఆస్కార్ అవార్డుకి RRR చిత్రంలో నాటు నాటు సాంగ్ మాత్రమే నామినేట్ అయింది” అని చంద్రబోస్ ఓ క్లారిటీ ఇచ్చారు. 

Also Read :  మహేష్ బాబు ఆ మూవీలో డైలాగ్ చెప్పడానికి 2గంటలు పట్టిందట.. ఎందుకంటే..?

Visitors Are Also Reading