పెళ్లి ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. కానీ పెళ్లి తరవాత జీవిత భాగస్వామి తో కలిసి మెలిసి జీవించడమే ప్రశాంతమైన జీవితం. అయితే అలాంటి ప్రశాంతమైన వైవాహిక జీవితం కావాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు అని చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా వెల్లడించాడు. ఆ ఐదు తప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వైవాహిక జీవితంలో ఇద్దరూ అబద్ధాలు అసలు చెప్పకూడదని చాణక్యుడు తెలిపాడు. అబద్దాలు చెప్పడం వల్ల వారిపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది అని చెబుతున్నాడు. అంతేకాకుండా అబద్దాలు చెప్పడం వల్ల కొత్త అనుమానాలు వస్తాయని చాణక్యుడు పేర్కొన్నాడు.
జీవిత భాగస్వామి కోపంలో ఉన్నపుడు ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. కానీ అగ్గిలో ఆజ్యం పోసినట్టు ఆ కోపాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని తెలిపాడు. అలా చేస్తే వైవాహిక జీవితానికే ప్రమాదమని చెప్పాడు.
Advertisement
భార్య భర్తలు ఇతరుల ముందు ఒకరినొకరు కించపర్చుకోకూడదు అని తెలిపాడు. ఏ విషయంలో అయినా కించపరుచుకోవడం వల్ల ఇతరులకు చులకన అవుతాము అని చెప్పాడు. కించ పరచడం వల్ల బంధం బలహీన పడటం తో పాటు కొన్నిసార్లు బంధం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని అన్నాడు.
వైవాహిక బంధంలో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదని చాణిక్యుడు తెలిపాడు. మూడో వ్యక్తి తమ వైవాహిక జీవితం లోకి వస్తే బంధం కొనసాగదని చెప్పాడు.
ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి. భార్య భర్తలకు కూడా సెపరేట్ గా కొన్ని రహస్యాలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు అవి చెప్పకపోవడమే మంచిదని చాణక్యుడు తెలిపారు. ఏది చెప్పాలో…ఏది చెప్పకూడదో తెలిసి ఉండాలని అన్నారు.
Also read :
నా అనుకున్న వాళ్లచేతిలోనే దారుణంగా మోసపోయి రొడ్డునపడ్డ స్టార్ హీరోయిన్ లు….!
మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని మిలియన్ డాలర్లో తెలుసా…ఒక్క విల్లాకే…!