ప్రస్తుతం చాలామంది లైఫ్ కోచ్ లు ఉన్నారు. కానీ ఒకప్పటి నుండి చాణక్యుడు లైఫ్ కోచ్ గా ఉన్నాడు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన చాణక్యనీతి ద్వారా కొన్నివేల విషయాలను ప్రజలకు వెల్లడించారు. వాటిని పాటిస్తే జీవితంలో ఎన్నింటినో సాధించగల శక్తిసామర్థ్యాలు సొంతమవుతాయి. జీవితంలో ఏదైనా సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు.. దానికి అదృష్టం కూడా కావాలి.
అయితే కష్టం అదృష్టం రెండు కావాలంటే జీవితంలో కొన్నింటిని అలవాటు చేసుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. మనం చేసే కొన్ని పనులు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చాణక్యుడు తన నీతి గ్రంథంలో వెల్లడించాడు. అలా చాణిక్యుడు చెప్పిన నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
Advertisement
Also Read: Breaking : ఊటీలో కుప్ప కూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్…!
కన్నతల్లి సేవ
మనిషికి జీవం వచ్చిందంటే అది కన్నతల్లి వల్లనే… ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తల్లిని దేవతలా కొలుస్తారు. కాబట్టి తల్లిని గౌరవించే వాడు ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు ఆమె ఆశీర్వాదాన్ని పొందుతాడు అని చాణక్యనీతి లో చాణిక్యుడు వెల్లడించాడు. జీవితంలో ఎన్నడూ లేని లోటు ను కలిగి ఉన్న సమయంలో కూడా తల్లి సేవ చేయడం ద్వారా సమస్యలు అన్ని తొలగిపోతాయని చెప్పాడు. అన్ని ప్రమాదాల నుండి అతడు రక్షించబడుతాడని వెల్లడించాడు.
Advertisement
గాయత్రి మంత్రం
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో గాయత్రి మంత్రం కూడా ఒకటి. గాయత్రి మంత్రాన్ని మనసుపెట్టి జపించడం ద్వారా మనిషిలో సానుకూలత పెరుగుతుంది. దాని ద్వారా అతని వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. అలాంటి వ్యక్తులు జీవితంలో ఏదైనా సులభంగా సాధించగలుగుతారు అని చాణక్యనీతి చెబుతోంది.
అన్నదానం
అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం అన్నదానం గా భావిస్తారు. ఆకలితో ఉన్న వాడి ఆకలి తీర్చడం ద్వారా దాహం వేసిన వారికి నీళ్లు ఇవ్వడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. ఈ పనిని పూర్తి భక్తితో చేయాలని అలాంటి వ్యక్తి జీవితంలో కష్ట సమయాలు వచ్చినా కూడా వాటిని దాటి దాటేయగలుగుతాడు అని చాణిక్యుడు చెబుతున్నాడు.
ఏకాదశి
ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదని చాణిక్యుడు చెబుతున్నాడు. ఆరోజు వ్రతాలు చేయడం ద్వారా వ్యక్తి పాపాలు హరించి పోతాయని తెలిపారు. పాపాలు నశించిన తర్వాత జీవితంలో తిరిగి ఆనందం ప్రారంభమవుతుందని చాణిక్యుడు తన నీతిలో పేర్కొన్నాడు. వ్రతాలు చేయడం ద్వారా దురదృష్టం కూడా అదృష్టం గా మారుతుందని చెబుతున్నాడు
Also Read: సినిమా గ్రాఫిక్స్ షూటింగ్ లు గ్రీన్ మ్యాట్ తో నే ఎందుకు చేస్తారో తెలుసా?