Ad
ఏ ఒక్క మనిషి ఆలోచన ఒకేలా ఉండదు. ప్రతి ఒక్క మనిషి కూడా మరో మనిషికి విభిన్నంగా ఉంటాడు. అంతేకానీ అందరూ ఒకేలా ఉండరు. పైగా ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో విధంగా ఉంటుంది. పైగా అందరూ మనం చెప్పేది వినాలని కూడా ఏమీ లేదు. కానీ ఇలా చేస్తే ఎదుట వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవచ్చని ఆచార్య చాణక్య అన్నారు.
Advertisement
- కొందరైతే మూర్ఖులు ఉంటారు. వాళ్ళు అసలు చెప్పింది వినరు. వాళ్ళ దారిలో వాళ్ళు పోతారు తప్ప అలాంటి వారు మనం చెప్పేది వినరు. వాళ్ళు వినాలంటే కొంతకాలం వరకు వాళ్ళు చెప్పేది వినాలి. అప్పుడు కొన్నాళ్ళకి వాళ్ళు మన కంట్రోల్ లోకి వస్తారు.
- కోపిష్టి గుణం ఉంటే వాళ్లతో మర్యాదగా ప్రవర్తిస్తూ ప్రశాంతంగా మాట్లాడాలి. అలాంటప్పుడు కొన్నాళ్ళకి వాళ్లు కూల్ అవుతారు. అదే ఒకవేళ కోపంగా మీరు ఉంటే సఖ్యత కుదరదు.
Advertisement
- ఎదుట వాళ్ళు మీ కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే వారితో నిజాయితీగా ఉండడం మంచిది. అప్పుడు వారు మీ దారిలోకి వస్తారు.
- కొంతమందికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళ అభిప్రాయాలని గౌరవిస్తూ మర్యాదగాపూర్వకంగా వాళ్ళతో ఉండాలి. ఆటోమేటిక్ గా అప్పుడు వాళ్లే మన దారిలోకి వచ్చేస్తారు.
- అత్యాశ, స్వార్థం వున్నవాళ్లు లాభం ఉంటే ఏ పనైనా చేస్తారు. అలాంటి వారికి డబ్బు చూపించి మీరు మీ దారిలోకి తీసుకురావచ్చు.
- మర్యాద కనుక లేనట్లయితే అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. డబ్బులు రానిచోట గౌరవం లేని చోట ఉండకూడదు.
- దురాశ స్వార్థం అత్యాశ ఉంటే ఎప్పటికీ ఆ లక్షణాలు మారవు.
- ఎప్పుడు విజయం సాధించే వారిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా విజేతలు అవ్వచ్చు. జీవితంలో వచ్చే అవకాశాలని వినియోగించుకోవాలి. ఏ అవకాశాన్ని వదిలేసుకోకూడదు.
Also read:
- టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో.. యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమాలివే..!
- మెగా హీరోల కూతుళ్లకు ఎందుకు ఇలా జరుగుతోంది.. ఏమైనా శాపం ఉందా..?
- చనిపోయిన పెద్దలు పితృ దేవతలు కాదు.. మరి పితృ దేవతలు అంటే ఎవరు..?