సాధారణంగా చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆర్థికవేత్తగా, మంత్రిగా, ఆచార్య చాణక్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా జీవిత సత్యాలను జీవితంలో అందరూ పాటించదగినటువంటి విషయాలను ఆచార్య చాణక్య అద్భుతంగా చెప్పారు. కాలంతో సంబంధం లేకుండా చాణక్య నీతి అందరికీ ఏదో ఒక విధంగా దారి చూపిస్తుంది. చాణక్యుడు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఎప్పుడూ ఆచరణీయంగానే ఉంటాయి.
Advertisement
మానవుల వ్యవహార శైలికి సంబంధించి ఆచార్య చాణక్యుడు చెప్పిన వాస్తవాలు చాలా వరకు నిజమయ్యాయి. అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఒక మనిషి ఎలా ఉండాలి..? ఎలా ప్రవర్తించకూడదు…? ఏది ఎప్పుడు ఎలా చేయాలి..? అనే విషయాలను సందర్భాలను బట్టి ఆచార్య చెప్పుకొచ్చాడు. భార్యలతో భర్తలు ఎలా ఉంటే మంచిది అనే విషయంలో పలు సూచనలు ఇచ్చారు చాణక్య. ముఖ్యంగా భర్త తనకు సంబంధించినటువంటి నాలుగు విషయాల గురించి ఎప్పుడూ కూడా తన భార్య దగ్గర ప్రస్తావించకూడదు. అందువల్ల ఇబ్బందులు తలెత్తుతాయని.. ఆచార్య చెప్పుకొచ్చాడు.
ఆదాయం :
భర్త తన సంపాదన ఎంతో కూడా భార్యకు చెప్పకూడదు. భర్త ఆదాయం ఎంతో భార్యకి తెలిస్తే.. ఆ ఇంట్లో దుబారా ఖర్చులు ఎక్కువవుతాయి. ఒక్కోసారి ఖర్చు ఆదాయానికి మించి అయిపోయే అవకాశము కూడా ఉంటుంది. తన భర్త ఆదాయం ఎక్కువ అని తెలిసిన భార్య ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభిస్తుందట. అందుకోసమే భర్త సంపాదన ఎంత అనేది భార్యకు అస్సలు చెప్పకూడదు అని చాణక్య చెప్పాడు.
బలహీనత :
Advertisement
ప్రతి మనిషికీ ఓ బలహీనత ఉంటుంది. అలాంటి బలహీనత గురించి తన భార్యకు ఎప్పటికీ తెలియనివ్వకూడదు. ఎందుకు అంటే.. భార్య తన భర్త బలహీనతను పదే పదే ప్రస్తావిస్తుంది. ఒకవేళ బలహీనతను అధిగమించాలని భర్త అనుకున్నట్టయితే.. ఆ దిశలో అడుగు ముందుకు పడనీయకుండా చేస్తుంది. అదేవిధంగా భార్య పదే పదే భర్తకు గుర్తు చేస్తే ఆత్మాన్యూనత భావం ఆ భర్తలో కలిగే అవకాశముంటుంది. ఎన్నో అనర్థాలకు కూడా దారి తీసే అవకాశముంది.
Also Read : రోజుకు ‘టీ’ ఎన్ని కప్పులు తాగాలో మీకు తెలుసా ?
అవమానం :
ఎలాంటి పరిస్థితులో అయినా తాను పొందిన అవమానాన్ని భార్యకు మాత్రం తెలియనివ్వకూడదు. ఎప్పుడైతే.. తాను అవమానించబడినట్టు తన భార్యకి తెలుస్తుందో ఆ భార్య తన భర్తను చాలా చులకనగా చూడడం ప్రారంభింస్తుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో పొరపాట్లకు కూడా దారి తీసే అవకాశముంది. బయట పొందినటువంటి అవమానాల కంటే.. అధికంగా భార్య దగ్గర అవమానం పొందాల్సి వస్తుంది. అంతేకాదు.. భార్య ఆటపట్టించే అవకాశముంది. అందుకే భర్త పొందిన అవమానాన్ని భార్యకు అస్సలు తెలియకుండా జాగ్రత్త పడటం ఉత్తమం.
Also Read : Chanakya Niti : అమ్మాయిలో ఈ లక్షణాలు ఉంటే పెళ్లి చేసుకోవడానికి అస్సలు వెనుకడుగు వేయకండి..!
సహాయం :
మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది సైలెంట్ గా చేయాలి. భర్త తాను చేయాలనుకున్న సాయం గురించి భార్య వద్ద చెప్పినట్టయితే సమస్యలు తలెత్తే అవకాశముంది. చేసే సహాయాన్ని చేయనీయకుండా భార్య అడ్డుపడే అవకాశముంటుంది. ఒక్కోసారి భర్త సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా.. భార్య ఎవరికైనా సాయం చేయాలని కోరవచ్చు. అందుకే ఎవరికైనా సాయం చేయాలనుకున్నా.. లేదా బహుమతి ఇవ్వాలనుకుంటే భార్యతో చెప్పకుండా మీకు మీరే సాయం చేయడం బెటర్.
Also Read : Chanakya Niti : ఈ 5లక్షణాలు ఉన్న మహిళలకు పురుషులు తలవంచకుండా ఉండలేరట..!