మనిషి జీవితంలో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను చాణక్య నీతి ద్వారా చెప్పాడు. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో వివరించాడు. నేటి పోటీ ప్రపంచంలో మన దైనందిన జీవితంలో మనం సంభాషించే వ్యక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడి మాటలు శతాబ్దాలుగా.. నేటికి చాలా మంది పాటిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే చాలా కోణాలపై చాణక్యుడు తన అభిప్రాయాలను వెల్లడించాడు. ముఖ్యంగా జీవితంలో ఈ ఐదు రకాల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
తన భర్తను మోసం చేసే లేదా ఇతర పురుషుల గురించి ఆలోచించే భార్య మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలా మోసం చేసే భార్య ఓ ఆయుధం లాంటిది. అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేసి తమ కుటుంబాలకు పరువు తీయడానికి కూడా వెనుకాడరు. అలాంటి భార్యతో కలిసి జీవించడం నరకం అని చాణక్యుడు చెప్పాడు.
ఒక సేవకుడు తన యజమానికి ఇవ్వాల్సిన విధేయతను మించి దోచుకోవడం ప్రారంభించినట్టయితే.. అతని కంటే ప్రమాదకరమైన వ్యక్తి మరొకడు లేడు. ఆ సేవకుడు తమ ఇంటి యజమానికి నమ్మక ద్రోహం చేస్తాడు. తమ లాభం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. కాబట్టి ఉద్యోగులను నియమించుకునేటప్పుడు క్షణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే నియమించుకోవాలి.
Advertisement
మీరు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచే వారే నిజమైన స్నేహితులు. కొంత మంది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. అలాంటి వారు నకిలీ స్నేహితులు. నకిలీ స్నేహితుడు మిమ్మల్నీ సద్వినియోగం చేసుకుంటాడు. మీకు ద్రోహం చేస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టే, వెన్నుపోటు పొడిచే స్నేహితులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు.
మారు వేషాలు వేసే వారు.. చాలా మంది తమ నిజ స్వరూపాన్ని కూడా ఇతరులకు తెలియకుండానే దాచుకుంటారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. కానీ అవకాశం దొరికినప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడుతారు. జీవితంలో అలాంటి వారితో సన్నిహితంగా ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు చెత్తగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు మీ ముందు తీయగా మాట్లాడుతారు. మీ వెనుక మీ గురించి పుకార్లు వ్యాప్తి చేస్తారు. అలాంటి వారితో సహవాసం మానుకోవడం బెటర్ అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్నీ సద్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోకుండా సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. సాయం కోసం మీరు విశ్వసించే వ్యక్తులను మాత్రమే చేరుకోండి. మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులతో సహవాసం చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. ఎందుకు అంటే.. వారు తమ స్వలాభం కోసం మిమ్మల్ని ప్రమాదంలో పడేయడానికి వెనుకాడరు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
CHANAKYA NITI : స్త్రీలలో ఈ 4 లక్షణాలు ఉండకూడదు.. తనకే కాదు.. తాను వెళ్లిన కుటుంబానికి కూడా..!