సాధారణంగా మనిషి జీవితానికి సంబంధించి ఆచార్య చాణకడు రూపొందించిన ప్రత్యేక విధి విధానాలు నేటి తరం వారు అమలుపరిచే విధంగా ఉంటాయి. ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యూహ కర్త మాత్రమే కాదు.. జీవిత కోచ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆయన రూపొందించిన నీతి శాస్త్రంలో మానవ జీవితము ఎంత గొప్పగా జీవించాలనే అంశంపై ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ఇతరులతో చెప్పకూడదని పలు అంశాలను.. అవి చెబితే సమాజంలో ఆ వ్యక్తి మనుగడ కష్టమని ఆచార్య పేర్కొన్నాడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇంట్లో గొడవలు :
ముఖ్యంగా మీ ఇంట్లో జరిగే విషయాలు ఏవి కూడా ఇతరులతో అస్సలు పంచుకోకూడదు. ఏవైనా గొడవలు జరిగినా, లోటు పాట్లు ఉన్నా.. వాటిని అస్సలు బయటికి చెప్పకూడదు. ఒకవేళ చెప్పినట్లయితే అది మీ కుటుంబానికి అపకీర్తి తీసుకొస్తుంది. మీ ఇంట్లోని లోపాలను మీరే సరిదిద్దుకోవాలి. మీ శత్రువులకు ఈ వీక్నెస్ తెలిసినట్లయితే దానిని మీపై ప్రయోగించే అవకాశం ఉంది. దీని ద్వారా సమాజంలో మీ గౌరవానికి భంగం వాటి అవకాశం ఉంది.
వైవాహిక జీవితం :
Advertisement
భార్యాభర్తల మధ్య చాలా విషయాలు జరుగుతుంటాయి. అవి గొడవలే కావచ్చు.. మరే ఇతర సీక్రెట్స్ కావచ్చు.. ఏదైనా ఉండొచ్చు. ఇతరుల ముందు అస్సలు బహిర్గతం చేయకూడదు. అలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం విచ్చిన్నానికి దారి తీయవచ్చు. భార్యాభర్తల మధ్య జరిగిన ఏ విషయమైనా జరిగిన మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెబుతుంటాడు ఆచార్య చాణిక్య.
సిద్ధ ఔషదం :
సిద్ధ అవసరాల గురించి తెలిసిన వ్యక్తి వాటి తయారీకి సంబంధించిన రహస్యాలను అసలు బయటకు చెప్పకూడదు. ఎప్పుడు రహస్యంగానే ఉంచాలి. అప్పుడే ఆ ఔషధాలు సక్రమంగా పనిచేస్తాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
దానం :
దానధర్మాల అన్నవి మన కర్మ ఫలాలను తగ్గిస్తాయని పెద్దలంటుంటారు. అదే విధంగా దాతృత్వం అనేది గొప్ప విషయంగా ఆచార్య చాణిక్యం పేర్కొన్నాడు. దానం చేసే విషయాలను కూడా ఎవరికి చెప్పకూడదని.. తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాడు.
Also Read : Chanakya Niti : పురుషులు ఈ లక్షణాలు కలిగి ఉంటే మహిళలు ఇష్టపడతారు..!