మనిషి జీవితంలో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను చాణక్య నీతి ద్వారా చెప్పాడు. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో వివరించాడు. ఆచార్యచాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తి పేదరికంలో జీవించడానికి చాలా కారణాలున్నాయి. చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని అంశాలు వ్యక్తి ఆర్థిక పతనానికి దోహదపడుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆర్థిక ప్రణాళిక లేకపోవడం :
Advertisement
మానవ జీవితంలో ఆర్థిక ప్రణాళిక ప్రాముఖ్యతపై చాణక్యుడు ఇలా చెప్పాడు. ఏ వ్యక్తి అయినా సరే ఆర్థిక ప్రణాళికలను చాలా తెలివిగా ప్లాన్ చేసుకోవడంలో విఫలం చెందితే జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. అధిక వ్యయం, అప్పులు పెరిగిపోయి చివరికీ పేదరికానికి దారి తీయవచ్చు.
కుటుంబ ఏకీకరణ :
కుటుంబంలో ఐక్యత, కలిసి ఉండాలనే భావాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాలి. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి.. భాగస్వాములతో కలిసి పలు కార్యకలాపాల్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించండి. అంతేకాదు.. విజయాలు, కెరీర్ లో మైలురాళ్లను ఫ్యామిలీ సభ్యులు అందరూ కలిసి సమిష్టిగా జరుపుకునే విధంగా ప్రోత్సహించండి. కుటుంబ సంబంధాలను బలపరుచుతుంది.
Advertisement
వనరుల నిర్వహణ :
చాణక్యుడి ప్రకారం.. తమకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను సరిగ్గా నిర్వహించలేకపోతే అది..అతనికి పేదరికానికి ఓ ముఖ్యమైన కారణం. ఓ వ్యక్తి తన ఆదాయాన్ని నిర్వహించటంలో తెలివిగా ఖర్చు చేయడం.. భవిష్యత్ కోసం పొదుపు చేయడంలో విఫలం చెందితే.. అది ఆర్థిక ఇబ్బందులకు చివరికీ పేదరికానికి దారి తీస్తుంది.
విద్య, నైపుణ్యాలు లేకపోవడం :
ఓ వ్యక్తి విజయంలో వైద్య, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని నమ్మాడు చాణక్యుడు. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకుండా వ్యక్తులు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లేదా అభివృద్ధి కోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పేదరికంలో చిక్కుకొని ఉంటారు.
వ్యసనాల్లో మునిగిపోవడం :
జూదం, అతిగా మద్యపానం, లేదా మరి ఇంకేదైనా వ్యసనాల భారీన పడి మనిషి ఆర్థిక ఎదుగుదలకు అడ్డంకులని హెచ్చరించాడు చాణక్యుడు. ఈ అలవాట్లు ఆర్థిక వనరులను హరించి దరిద్రంలో ఉండేవిధంగా చేస్తాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
CHANAKYA NITI : స్త్రీలలో ఈ 4 లక్షణాలు ఉండకూడదు.. తనకే కాదు.. తాను వెళ్లిన కుటుంబానికి కూడా..!