Home » ఆ రెండు త‌ప్పుల వ‌ల్లే సుధీర్ నుండి జ‌బ‌ర్ద‌స్త్ నుండి తీసేసారా..? అస‌లేం జ‌రిగింది..?

ఆ రెండు త‌ప్పుల వ‌ల్లే సుధీర్ నుండి జ‌బ‌ర్ద‌స్త్ నుండి తీసేసారా..? అస‌లేం జ‌రిగింది..?

by AJAY
Ad

తెలుగులో అతిపెద్ద కామెడీ షో ఏదని అడిగితే ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా జ‌బ‌ర్ద‌స్త్ అని చెప్పొచ్చు. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఆ కామెడీ షో ద్వారా ఎంతోమంది క‌మెడియ‌న్ లు ప‌రిచ‌యం అయ్యారు. అయితే చాలా మంది ఇప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్ ను వీడారు అన్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఇత‌ర షోల‌లో సంద‌డి చేస్తున్నారు. అయితే చాలా కాలం పాటూ అదే కామెడీ షోలో కొన‌సాగిన సుధీర్ కూడా జ‌బ‌ర్దస్త్ నుండి బ‌య‌ట‌కు రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Advertisement

కాగా తాజాగా బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన చ‌లాకీచంటి జ‌బ‌ర్ద‌స్త్ గురించి ఆస‌క్తికర కామెంట్స్ చేశాడు. సుధీర్ ను రెండు త‌ప్పుల వ‌ల్ల జ‌బ‌ర్ద‌స్త్ నుండి తీసేసార‌ని అనుకుంటే విన్నాన‌ని చ‌లాకీ చంటీ చెప్పారు. అయితే ఆ రెండు త‌ప్పులు ఏంటి అన్న‌ది మాత్రం చంటీ చెప్ప‌లేదు. తాను జ‌బ‌ర్ద‌స్త్ నుండి మూడు సార్లు బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పారు. మొద‌టిసారి త‌న‌కు జ‌బ‌ర్ద‌స్త్ రొటీన్ గా అనిపించి బ్రేక్ తీసుకుందామ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పారు.

Advertisement

రెండో సారి రెమ్యున‌రేషన్ విష‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పారు. ఇక మూడోసారి వెళితే మ‌ళ్లీ తీసుకున్నార‌ని అన్నారు. రెమ్యున‌రేష‌న్ కూడా ఎక్కువ ఇచ్చార‌ని చెప్పారు. మూడోసారి ఓ షో కోసం వెళ్లాన‌ని అది కూడా ఈటీవీలోనే అని చెప్పారు. వాళ్ల‌తో మనం మంచిగా ఉన్నంత‌వ‌ర‌కూ మ‌న‌తో కూడా మంచిగానే ఉంటార‌ని చంటి తెలిపాడు.

అయితే జ‌బ‌ర్ద‌స్త్ డైరెక్ట‌ర్ లు మారారని ఒక‌ప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లుగా చేసిన‌వాళ్లు అన్నా అని పిలిచేవార‌ని కానీ ఇప్పుడు వాళ్లు డైరెక్ట‌ర్ లు అవ్వ‌డంతో గౌర‌వం కోరుకుంటున్నార‌ని అక్క‌డే స‌మ‌స్య వ‌స్తుంద‌ని అన్నారు. మ‌ల్లెమాల వాళ్లు రెమ్యున‌రేషన్ కూడా బాగానే ఇస్తార‌ని మ‌న‌కు కెరాఫ్ లేనప్పుడు అవ‌కాశాలు ఇచ్చార‌ని అన్నారు.

Visitors Are Also Reading