Home » మ‌రోసారి ప్రేమ‌లో ప‌డ్డ చైతూ…ఎవ‌రితోనంటే…?

మ‌రోసారి ప్రేమ‌లో ప‌డ్డ చైతూ…ఎవ‌రితోనంటే…?

by AJAY
Ad

టాలీవుడ్ ల‌వ్లీ క‌పుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ‌చైత‌న్య సమంత విడాకులు తీసుకుని అంద‌ర్నీ షాక్ కు గురిచేశారు. ఎమ్మాయ చేశావే సినిమా స‌మ‌యంతో చైతూ స‌మంత మాయ‌లో ప‌డిపోయాడు. ఆ త‌ర‌వాత కొంత కాలం డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లైన నాటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉన్న సామ్ చైతూలు నాలుగేళ్ల త‌ర‌వాత తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి త‌మ వైవాహిక‌ జీవితానికి బ్రేక‌ప్ చెప్పారు. ఇక విడాకుల త‌ర‌వాత స‌మంత మ‌ళ్ళీ సినిమాళ్లో బిజీగా మారింది. వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండ‌టంతో పాటు సమంత తీర్థ‌యాత్ర‌ల‌కు వెళుతూ సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తోంది.

Advertisement

ఇక చైతూ నుండి మాత్రం అస‌లు ఎలాంటి వార్త‌లు రావ‌డం లేదు. రీసెంగ్ గా వ‌చ్చిన ల‌వ్ స్టోరీ సినిమా విజ‌యంతో చైతూ కొంత‌కాలం స‌క్సెస్ మీట్ లు..ఇంట‌ర్వ్యూల‌తో బిజీ అయ్యాడు. ఇక చైతూ మ‌రో హ‌రోయిన్ తో ల‌వ్ లో ఉన్నారంటూ ప‌లు గాసిప్ లు వినిపించాయి కానీ వాటిపై కూడా ఆ యంగ్ హీరో స్పందించ‌లేదు. ఇక ప్ర‌స్తుతం మాత్రం చైతూ ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే చైతూ ల‌వ్ లో ప‌డింది మాత్రం రియ‌ల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. నాగ‌ర్జున, నాగ‌చైత‌న్య హీరోలుగా బంగార్రాజు సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో నాగ‌చైత‌న్య త‌ర‌పున హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి న‌టిస్తోంది. నాగ‌ల‌క్ష్మి పాత్ర‌లో కృతి న‌టిస్తుండ‌గా రీసెంట్ గా ఈ సినిమా నుండి ఆమె పోస్టర్ ను నాగ‌చైత‌న్య విడుద‌ల చేశారు. బంగార్రాజు నుండి మా నాగ‌ల‌క్ష్మి లుక్ ను రిలీజ్ చేస్తున్నామంటూ చైతూ ప్రేమ‌ను ప్ర‌దర్శించారు. దాంతో నాగచైత‌న్య తాను ప్ర‌స్తుతం సినిమాల‌తోనే ల‌వ్ లో ఉన్న‌ట్టు చెప్ప‌క‌నే చెబుతూ రూమ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఇక నాగ‌చైత‌న్య టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నారు. అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో చైతూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Visitors Are Also Reading