Home » CBSE : సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE : సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

by Bunty
Ad

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం మొదలైంది. అటు ఉద్యోగ పరీక్షలు, ఇటు విద్యార్థులకు వార్షిక పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపద్యంలోనే వరుసగా పరీక్షల షెడ్యూల్ విడుదలవుతున్నాయి. అయితే తాజాగా సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను బోర్డు తాజాగా విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఈ పరీక్షలు మార్చి 21 వరకు కొనసాగ నున్నట్లు వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై, ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతాయని బోర్డు వెల్లడించింది. రెండు సబ్జెక్టుల మధ్య గ్యాప్ ఇస్తూ, జేఈఈ మెయిన్ తదితర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డేట్ షీట్లను విడుదల చేసినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది.

Advertisement

ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. కొన్ని పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంటల వరకు మరికొన్ని పరీక్షలు 10:30 నుంచి 12:30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థుల ప్రిపరేషన్ సజావుగా సాగడమే లక్ష్యంగా షెడ్యూల్ ను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసినట్లు సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది.

read also : పంత్ కారుకు ప్రమాదం.. విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన జనాలు !

Visitors Are Also Reading