Home » జాబ్ చేసే వాళ్లకు కేంద్రం షాకింగ్ న్యూస్…!

జాబ్ చేసే వాళ్లకు కేంద్రం షాకింగ్ న్యూస్…!

by Bunty
Ad

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చట్టంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వేతనాలు. సామాజిక భద్రత. పారిశ్రామిక సంబంధాలు మరియు వృత్తి భద్రత. ఆరోగ్యం సహా పలు అంశాలకు సంబంధించి కీలక మార్పులు చేసే అవకాశం కనబడుతోంది. ప్రధానంగా నాలుగు విధానాల మీద దృష్టి సారించి జాతీయ మీడియా పేర్కొంది. ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Advertisement

వర్క్ ఫ్రం హోం విధానం అమలులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించవచ్చు అని తెలుస్తోంది. ఏప్రిల్ 2021 నుండి ఈ నూతన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలలో దీనికి సంబంధించి ఇంకా ఆమోదం తెలుపలేదు. కార్మిక విధానం అనేది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది.

కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఆమోదం తెలపాలని కేంద్రం కోరుతుంది. ఉద్యోగులకు ప్రస్తుతం ఐదు రోజుల పని వారానికి నాలుగు రోజులు మాత్రమే ఉండే విధంగా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త లేబర్ కోడ్ అమలు వల్ల ఉద్యోగుల బేసిక్ పే మరియు ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. జీతాల విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయం యాజమాన్యాలకు ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. పిఎఫ్ విషయంలో యజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి అని అందుకే మార్పులు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.

Visitors Are Also Reading