Home » గోవుకు సీమంతం వేడుక‌..ఎక్క‌డంటే..?

గోవుకు సీమంతం వేడుక‌..ఎక్క‌డంటే..?

by Anji
Published: Last Updated on
Ad

హిందువులు గోమాత‌ను దైవంగా భావించి పూజిస్తారు. గోవులో స‌క‌ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని పురాణాల క‌థ‌నం.. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వ‌ర్యాలు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంప‌ద‌లు ల‌భిస్తాయ‌ని సంతానం లేనివారికి సంతానం క‌లుగుతుంద‌ని హిందువులు న‌మ్మ‌కం. అందుక‌నే హిందువులు ఆవును భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. అంతేకాదు త‌మ ఇంట్లో ఆవును ఎంతో ఇష్టంగా సొంత ఇంటి పిల్ల‌లా భావించి పెంచుకుంటారు. ఆవులు, వాటి సంతానాన్ని త‌మ ఇంటి స‌భ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడ‌ట‌మే కాదు.

Also Read :  IPL 2022 Auction : గ‌తంలో 20 ల‌క్ష‌లు.. ప్ర‌స్తుతం అత‌ని ధ‌ర ఎంతంటే..?

Advertisement

Advertisement

వాటికి సీమంతం, పుట్టిన రోజు నామ‌క‌ర‌ణం, వంటి ఫంక్ష‌న్లు జ‌రిపి ప‌దిమందికి త‌మ సంతోషాన్ని పంచుతూ వేడుక‌ల‌ను జ‌రుపుతారు. తాజాగా అనంత‌పురం జిల్లాలో ఓ కుటుంబం వైభ‌వంగా గోమాత‌కు సీమంతం చేసింది. ముఖ్యంగా ముదిగుబ్బ‌లోని అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో ఇంటి ఆడ‌బిడ్డ‌ల‌కు నిర్వ‌హించిన‌ట్టే గోవుకు సీమంతం వేడుక‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. గోమాత‌కు మ‌త్తైదువుల సమ‌క్షంలో సీమంతం కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా చేశారు.

 

గోవుకు పసుపు కుంకుమ‌ల‌తో పూజ‌లు చేసి ప‌ట్టు వ‌స్త్రాల‌తో అందంగా అలంక‌రించారు. త‌మ సంతోషాన్ని ప‌ది మందికి పంచుతూ.. ఏకంగా ఆవు సీమంతం వేడుక‌ల్లో భాగంగా ఐదు వంద‌ల మందికి అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గోమాత ప్రాముఖ్య‌త‌ను అంద‌రికీ తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతోనే సీమంతం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. గ్రామంలోని మ‌త్తైదువులు, మ‌హిళ‌లు గోవుకు చీర‌సార‌, పసుపు కుంకుమ‌లు స‌మ‌ర్పించారు.

Also Read :  ఎలా ఉండేవారు ఎలా మారారు? సినీ మాయ‌!

Visitors Are Also Reading