ఈ ఆధునిక ప్రపంచంలో రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి అరచేతిలో సెల్‌ఫోన్ ఇమిడి పోయింది. స్మార్ట్‌ఫోన్ తో ప్రపంచంలోని జరిగే వింతలు విశేషాలతో పాటు అవసరమైన అన్ని కార్యకలాపాలు జరిపేస్తున్న రోజులు. అదేవిధంగా వినోద సాదనంగా టీవీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మన ఇండియాలోనే ఇలా ఉంటే..ఇక అభివృద్ధి చెందిన అమెరికా ప్రజలు ఇంకెలా వీటిని ఉపయోగిస్తుంటారో ఇక తెలియనిది కాదు.
Advertisement
అభివృద్ధి చెందిన అమెరికాలోని ఓ నగరంలో టీవీ, మొబైల్‌ఫోన్ నిషేదించారంటే మీరు నమ్ముతారా..? ఇక తప్పదు నమ్మాల్సిందే. ఈ నగరం వర్జీనియాలోని పోకాహోంటాస్‌లో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది నివసిస్తుంటారు. వీరిలో ఎవరికీ మొబైల్ ఫోన్.. టీవీలు కూడా లేవు. ఇక గ్రీన్ బ్యాంక్ సిటీలో అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించడానికి వీలులేదు. టీవీలు, రేడియోలు, మొబైల్‌ల నుంచి ఐప్యాడ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, రిమోట్ కంట్రోల్ బొమ్మలు, మైక్రోవేవ్‌లు ఇక్కడ నిషేధించబడ్డాయి. ఇక ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది. దీనిని గ్రీన్‌బ్యాక్ టెలిస్కోప్ అంటారు. ఈ టెలిస్కోప్ 485 అడుగుల పొడవు.. 76 వందల మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉంటుంది. పెద్ద ఫుట్‌బాల్ మైదానం దాని డిష్‌లో సరిపోతుంది.
Advertisement
భారీ టెలిస్కోప్ ఉన్నచోట యూఎస్ నేషనల్ రేడియో ఆస్ట్రానమి అబ్జర్వేటరీ ఉంది. 1958లో దీనిని స్థాపించారు. అంతరిక్షం నుండి భూమిపైకి వచ్చే అలలపై ఇక్కడ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ నుంచి బ్లాక్ హోల్స్ వరకు అధ్యయనం చేసే పలు టెలిస్కోప్‌లు ఉన్నాయి. వీటి వినియోగంలో ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేదం విధించారు. టీవీలు, రేడియోలు, మొబైల్ ఫోన్లు, ఐఫ్యాడ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్ లు తదితర వాటిని నిషేదించారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే తరంగాలు అంతరిక్షం నుంచి వచ్చే తరంగాలను ప్రభావితం చేస్తాయి.
Also Read :
భర్త పరాయి స్త్రీల పై వ్యామోహం చూపించకుండా ఉండాలంటే భర్తని భార్య ఇలా చూసుకోవాలట..!
చిరంజీవి నాజర్ ను ఎందుకు చంపేస్తానని బెదిరించాడు..? అలా ఎందుకు చెప్పాడు..!