Rishab Pant car Accident: టీమిండియా క్రికెటర్, వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కు ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వీధుల్లో… రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు డివైడర్ ని ఢీ కొట్టి బోల్తా పడింది. కొద్ది దూరం రాసుకుపోవడంతో కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి.
Also Read: 2022 లో టీమిండియా ఏం కోల్పోయింది ? ఏం సాధించింది..?
Advertisement
అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రిషబ్ పంత్. కారు రోడ్డు డివైడర్ ని ఢీ కొట్టిన ఆరు నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందే ఆటుగా వెళుతున్న వాహనాదారులతో పాటు స్థానికులు కారు ప్రమాదాన్ని గుర్తించారు. ఈ సమయంలో వేగంగా కారు వద్దకి వచ్చిన జనాలు కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్ ని రక్షించడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయారట.
Advertisement
Also Read: రిషబ్ పంత్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే..?
దీంతో ఏం చేయాలో తెలియని రిషబ్ అతి కష్టం మీద బయటకు వచ్చి అంబులెన్స్ కి ఫోన్ చేశాడని తెలుస్తోంది. నిస్సహాయ స్థితిలో రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతంలో రిషబ్ పంత్ పడిపోయాడు. కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారు మంటల్లో కాలిపోతున్న చాలామంది వాహనదారులు పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోవడం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అయితే అటుగా వెళుతున్న మరికొందరు ప్రయాణికులు…పంత్ ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.