Home » సమంత కు బిగ్ షాక్.. పుష్ప ఐటెమ్ సాంగ్ కేసు నమోదు !

సమంత కు బిగ్ షాక్.. పుష్ప ఐటెమ్ సాంగ్ కేసు నమోదు !

by Bunty
Ad

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఆగస్టు 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. ఇక సునీల్ మరియు ఫాహద్ విలన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది.

Advertisement

Advertisement

ఈ పాట డిసెంబర్ 10వ తేదీన విడుదల కాగా… తాజాగా ఈ సాంగ్ వివాదంగా మారింది. ఈ పాటలోని లిరిక్స్ పురుష సమాజాన్ని కించపరిచేలా ఉందని… కోర్టు మెట్లు ఎక్కింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ. పురుషులను చాలా హీనంగా చూసినట్లు ఆ లిరిక్స్ ఉన్నాయని.. ఈ పాట తీసినందుకు చిత్రబృందం అలాగే నటించిన సమంతపై కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది.

వెంటనే ఈ పాటను తొలగించాలని అలాగే పురుష సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ కేసు నమోదు చేసింది. అయితే దీనిపై పుష్ పార్టీని ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా డిసెంబర్ 17వ తేదీన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

Visitors Are Also Reading