బర్రెలక్క గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బర్రెలక్క పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని పోటీ చేసింది కానీ ఓటమిపాలైంది. బర్రెలని కాస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.
కొల్లాపూర్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క ప్రధాన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రచారాన్ని నిర్వహించింది అలానే ప్రజలు యువత మద్దతు ఆమెకి ఇచ్చారు ఎన్నికల్లో ఓటమిపాలైనా రాజకీయాల్లో మాత్రం ఈమె చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement
రాంగోపాల్ వర్మ పలుమార్లు బర్రెలక్క గురించి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ పార్టీకి బర్రెలకి వచ్చిన ఓట్లు కూడా రాలేదని విమర్శలు చేశారు. దీంతో బర్రె లెక్క తరపున లాయర్ రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మ మాట్లాడిన మాటలు సరికాదని న్యాయవాది చెప్పారు. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయి పోయింది. బర్రె లెక్క కాస్త ఉంటుంది బర్రెలు లెక్క ఆమె మాట కూడా వింటున్నారు. అందుకే ఆమెని బరలక్క అంటారని రాం గోపాల్ వర్మ అన్నారు.
ఇలాంటి మాటలు అనడం సరికాదని రాంగోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లు ఫిలిమ్స్ తీసుకుని బతుకు కానీ ఈ ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకునే ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని న్యాయవాది అన్నారు. ఈ విషయం పై మరింత పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ నుండి తరిమి కొడతామని ఆయన వర్మ ని హెచ్చరించారు. ఆర్జీవీ సినిమాలతోనే కాకుండా , వివాదాస్పద వ్యాఖ్యల తో కూడా ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయంలోకి కూడా దూరి అనవసరంగా ఇబ్బందులని కొని తెచ్చుకున్నాడు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!