మన చుట్టూ ఉండే విషయాలలో చాలా వాటిని మనం ముందుగా గమనించము. ఒకేలా ఉండే వాటికి అలవాటు పడిపోతూ ఉంటాము. అయితే.. సరిగ్గా గమనిస్తే మనకి తెలియని విషయాలు మన చుట్టూ చాలానే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మీరెప్పుడైనా గమనించారా? కారు విండ్‌షీల్డ్ వాలుగా, బస్సులకు నిలువుగా ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ఉంటుంది? అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే, ఈ ఆర్టికల్ చదివి మీ సందేహం తీర్చేసుకోండి.
Advertisement
కారు విండ్‌షీల్డ్ వాలుగా ఉంటె, గాలి నిరోధకత తక్కువగా ఉంటుంది. ఇది కారు వేగంగా వెళ్ళడానికి, ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కార్లలో చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాం. కారు విండ్ షీల్డ్ ఏటవాలుగా ఉండడం వలన ఎదురొచ్చే గాలిని చీల్చడానికి సహాయపడుతుంది. అలాగే కారులో కూర్చుని ప్రయాణం చేసే వారికి నిలువుగా ఉన్న స్క్రీన్ కంటే, ఏటవాలుగా ఉన్న స్క్రీన్ వలన రక్షణ ఎక్కువగా ఉంటుంది.
Advertisement
అలాగే ఎండవేళల్లో ప్రయాణం చేసేటప్పుడు సూర్య రశ్మి ప్రభావం తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. హెడ్‌లైట్ల నుంచి వచ్చే వెలుగు, రిఫ్లెక్షన్స్ ప్రభావం డ్రైవర్ పై పడకుండా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. బస్సులు, ట్రక్కులు స్ట్రెయిట్ విండ్‌స్క్రీన్ లతో రూపొందించబడతాయి. ఎందుకంటే వీటికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. స్ట్రెయిట్ విండ్‌స్క్రీన్ ఏటవాలుగా ఉన్న స్క్రీన్ కంటే ఎక్కువ విజిబిలిటీను ఇస్తుంది. స్ట్రెయిట్ విండ్‌స్క్రీన్ వలన సీట్ వద్ద ఎక్కువ స్థలం ఉంటుంది. బస్సులు, ట్రక్కులలో ముందుకు చూసుకోవడానికి ఎక్కువ విజిబిలిటీ కావాలి. దీని కోసమే స్ట్రెయిట్ విండ్‌స్క్రీన్ ను ఇస్తారు.
మరిన్ని..
Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!