Home » షుగర్ వుందా..? అరటిపండు తినచ్చా..? తినకూడదా..?

షుగర్ వుందా..? అరటిపండు తినచ్చా..? తినకూడదా..?

by Sravya
Ad

చాలామంది ఈరోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. షుగర్ ఉన్నవాళ్లు, అరటిపండు తినొచ్చా..? తినకూడదా అని సందేహం చాలా మందిలో ఉంటుంది. షుగర్ అదుపులో ఉండాలన్నా, బరువుని తగ్గించుకోవాలన్నా అరటిపండును చాలా మంది దూరం పెడుతుంటారు. అరటిపండులో పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. అరటిపండును తీసుకుంటే, బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement

Advertisement

కండరాలు, నాడీ ఆరోగ్యం బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటిస్ కంట్రోల్లో లేని వాళ్ళు, అరటిపండుని కొంతకాలం తీసుకోకుండా ఉంటే మంచిది. 100 గ్రాములు అరటిపండు ముక్కల్లో 112 క్యాలరీల వరకు ఉంటాయి. అంటే ఇది 500 గ్రాముల బొప్పాయి, ఐదు జామ పండ్లతో సమానం. అలానే ఒక యాపిల్ తో కూడా ఇది సమానం. డయాబెటిస్ తగ్గాలన్నా బరువు తగ్గాలన్నా చిన్న అరటి పండుని తీసుకోవచ్చు కానీ ఎక్కువగా అరటి పండ్లు తీసుకోవడం మంచిది కాదు. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. బాగా పండని అరటిపండు తీసుకోవచ్చు. అలానే చిన్న అరటిపండుని తీసుకోవచ్చు.

Also read:

Visitors Are Also Reading