Home » చంద్రబాబు అరెస్ట్ పై “సి ఓటర్ సర్వే” సంచలనం… ఆ పార్టీకి షాక్ తప్పదా ?

చంద్రబాబు అరెస్ట్ పై “సి ఓటర్ సర్వే” సంచలనం… ఆ పార్టీకి షాక్ తప్పదా ?

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ప్రధాన నిందితుడిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గుర్తించిన ఏపీ సిఐడి పోలీసులు… సరైన ఆధారాలతో విజయవాడ ఏసీబీ కోర్టులో 11 రోజుల కిందట చంద్రబాబును ప్రవేశపెట్టారు. ఇక ఆధారాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 11 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో శ్వేతా బ్లాక్ లో ఉంటున్నారు.

Advertisement

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు అలాగే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఖండిస్తున్నారు. హై సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం చాలా దారుణమని ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఏపీ రాజకీయాలపై సి ఓటర్ సర్వే సంచలన విషయాలను తెరపైకి తీసుకువచ్చింది. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత ఏపీలో సి ఓటర్ సర్వే జరిగిందట. ఈ విషయాన్ని ఏఎన్ఐ తన ట్వీట్ లో పేర్కొంది.

Advertisement

ఇక ఈ ట్వీట్ ప్రకారం… ఏపీలో దాదాపు 1809 మంది నమూనా తీసుకుందట సి ఓటర్ సర్వే. చంద్రబాబు అరెస్టు కాకముందు… అయిన తర్వాత… ఏపీలో పరిస్థితులు ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలత ఉంటుంది అనే అంశాలపై సర్వే చేశారట. ఈ సర్వేలో చంద్రబాబుకు సానుకూలంగా వచ్చిందని సమాచారం. ఏకంగా 53% ఏపీ ప్రజలు… అరెస్టు తర్వాత చంద్రబాబుకు సానుభూతి కలిసి వస్తుందని చెప్పారట. అదే 36% మంది చంద్రబాబు అరెస్టు సీఎం జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తుందని వెల్లడించారట. మొత్తానికి మెజారిటీ పీపుల్ చంద్రబాబుకు కలిసి వస్తుందని చెప్పడం వైసిపి నేతల్లో గుబులు రేపుతోందని సమాచారం అందుతోంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading