Home » గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

by Azhar
Ad

భారత జట్టు యొక్క బౌలింగ్ విభాగాన్ని మూడు ఫార్మాట్ లలో ముందుండి నడిపించేది బుమ్రా. కానీ అజిత ఇంగ్లాండ్ పర్యటనలో గాయ పడిన బుమ్రా జట్టుకు దూరం అయిన విషయం తెలిసిందే. దాంతో బుమ్రా లేకుండానే వెస్టిండీస్, జింబాంబ్వే పర్యాటనలు చేసిన భారత జట్టు.. ఆసియా కప్ కోసం యూఏఈ కూడా వెళ్ళింది. అయితే ఈ టోర్నీలో బుమ్రా లేని లోటు జట్టు బౌలింగ్ లో కనిపించింది.

Advertisement

భువనేశ్వర్ కు తోడుగా ఏ పేసర్ రాణించకపోవడంతో జట్టు ఫైనల్స్ కు కూడా వెళ్ళలేదు. ఈ క్రమంలోనే బుమ్రా గాయం నుండి ఇంకా కోలుకోలేదు అనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ నెల 16న బీసీసీఐ ప్రకటించనున్న ప్రపంచ కప్ జట్టుకు ఆటను అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. కానీ తాజాగా బీసీసీఐ శిబిరం నుండి గుడ్ న్యూస్ అనేది వస్తుంది.

Advertisement

అదేంటంటే..ఈరోజు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షలో బుమ్రా అలాగే హర్షల్ పటేల్ ఇద్దరు పాస్ అయ్యినట్లు తెలుస్తుంది. హర్షల్ విండీస్ పర్యటనలో గాయ పడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ప్రపంచ కప్ ఎంపికకు అందుబాటులో ఉంటారు అనేది క్లారిటీ వచ్చింది. కానీ ఈ ప్రపంచ కప్ కు ముందు ఇండియాలో జరగబోయే ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు వీరిని ఎంపిక చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

భారత్ మార్పుల వల్లే ఓడిపోయింది..!

భారత్ ప్రపంచ కప్ గెలవాలంటే ఇలా చెయ్యాలి..!

Visitors Are Also Reading