సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం అని.. ఎందుకంటే సుధీర్ తనపై ఎంత పని వేసినా కాదనకుండా చేస్తాడు అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ వెల్లడించాడు. అంతేకాదు. సుధీర్‌ను ఎవరు ఏమైనా అన్నా కూడా అసలు ఏమి పట్టించుకోడు. మీకు తెలిసిన సుధీర్ వేరు.. మాకు తెలిసిన సుధీర్ వేరని.. తనకు నవ్వు వస్తే నవ్వేస్తాడు.. అక్కడ సందర్భం ఏదైనా సరే నేను కూడా అంతే నవ్వు వస్తే నవ్వుతాను అని చెప్పారు భాస్కర్. నా స్కిట్‌లో చేసేటప్పుడు సుధీర్ మా స్కిట్‌లో కూడా పది పంచ్‌లు రాసుకుంటాం భాస్కర్ అని అడిగేవారు.
Also Read : Statue of Equality : ముచ్చింతల్‌లో మరొక అద్భుత ఆవిష్కృతం
Advertisement
నేను సుధీర్ ను స్కిట్‌కు పిలుస్తాను కానీ కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పను. డైరెక్ట్‌గా స్టేజీ ఎక్కిస్తాను. స్టేజీ ఎక్కగానే ఏమి చేయాలని నన్ను అడిగేవారు. కానీ నేను ఏమి చెప్పను. కానీ ఆయన స్టేజ్ మీద వేసే పంచ్‌లకు ఆయన నవ్వుతారు. ఆయనతో పాటు నేను ఇంకా ఆడియన్స్ కూడా నవ్వుతారు. ఎందుకంటే సుధీర్, భాస్కర్ కాంబినేషన్ చాలా హయ్యల్ ఉంటుందని చెప్పారు. చిన్న విషయానికైనా నవ్వేస్తారు. బాస్ కెనడా నుంచి కామెంట్ పెడుతున్నారా అనగానే భాస్కర్ మనం హాలీవుడ్‌కు వెళ్తామన్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో నరేష్ సుధీర్‌ను ఏమి అనకు కింద కామెంట్స్ వరదలో కొట్టుకుపోతావు అని అన్నాడు. నేను సుధీర్‌తో అంటాను అప్పుడప్పుడు ఏజ్ ఎవరికైనా వస్తుంది కానీ క్రేజీ మాత్రం ఒకరికే వస్తుంది అది నువ్వే అని చెప్పాను.
Advertisement
ఇంటర్వ్యూలో యాంకర్ నీకు నచ్చిన కంటెస్ట్ ఎవరు అని ప్రశ్నించగా.. నాకు నచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అందులో రైజింగ్ రాజా, అప్పారావు, సుధాకర్, నరేష్, వర్ష, ఇమ్మాన్యుయల్, ఫైమా, రాజమౌళి వీరందరి యాక్టింగ్ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా లేడీ గెటప్‌లో శాంతి స్వరూప్, వినోద్, హరిత చాలా ఇష్టం. నాకు జడ్జీలలో రోజా, నాగబాబు అంటే ఇష్టం. ఎందుకంటే నాగబాబు, రోజా ఇద్దరూ ఓపెన్‌గా నవ్వుతారు. ఓ డైలాగ్‌కు రోజా చాలా సేపు నవ్వారు. మేము స్కిట్ ఆపి తరువాత చేశాం. ఇమాలియన్, నూకరాజుల కోసం నేను చాలా డైలాగ్‌లు రాస్తాను. అలాంటి వారిని చాలా ఎంకరేజ్ చేస్తానని చెప్పారు భాస్కర్. ముఖ్యంగా మన చుట్టూ మన కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్లను మనం ఎంకరేజ్ చేస్తే మనం కూడా గ్రోత్ అవుతామనేది నా సిద్ధాంతం అని బుల్లెట్ భాస్కర్ చెప్పారు.
Also Read : కళాకారులతో కాలు కదిపిన కేంద్ర మంత్రి…వీడియో వైరల్…!