Home » ఎన్టీఆర్ ను కాదని మెగా హీరోతో బుచ్చి బాబు..?

ఎన్టీఆర్ ను కాదని మెగా హీరోతో బుచ్చి బాబు..?

by Azhar

మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ఉప్పెన అనేది తెప్పించారు దర్శకుడు బుచ్చి బాబు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ శిష్యునిగా.. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో అయిన వైష్ణవ తేజ్ తో బుచ్చి బాబు.. ఉప్పెన అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇక పేరుకు తగ్గిన విధంగానే ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.

అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బుచ్చి బాబు వరుస అవకాశాలు వస్తాయి.. ఆయన నుండి వరుస సినిమాలు కూడా వస్తాయి అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే.. తన మొదటి సినిమా తర్వాత బుచ్చి బాబు.. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అనేది చేయడానికి సిద్ధం అయ్యాడు. అయితే ఎన్టీఆర్ కూడా బుచ్చి బాబుకు ఫ్రిన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ ఎన్టీఆర్ కొత్త సినిమా కొరటాలతో ఇంకా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ రెండు సినిమాలు పుత్త్రి అయ్యేవరకు బుచ్చి బాబు ఆగాలి. అయితే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కంటే ముందు.. ఓ మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి బాబు. కుదిరితే సాయి ధరమ్ తేజ్.. లేదంటే మళ్ళీ వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయాలని బుచ్చి బాబు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ – రోహిత్ కెప్టెన్సీలో తేడాలు ఇవే..!

మహిళల ఐపీఎల్ పై క్లారిటీ.. మొత్తం 5 జట్లు..!

Visitors Are Also Reading