Home » అరుదైన రికార్డు సాధించిన ప్రగతి.. సూపర్ ఆంటీ అంటూ కామెంట్స్ ?

అరుదైన రికార్డు సాధించిన ప్రగతి.. సూపర్ ఆంటీ అంటూ కామెంట్స్ ?

by Bunty

మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయ్యారు కొంతమంది మాత్రం దారుణంగా విఫలమయ్యారు. అయితే ఇండస్ట్రీలో… కీలక పాత్రలు నటించి ఇప్పటికీ పాపులర్ గానే నిలిచిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ముందు వరుసలో ఉంటారు.

Bronze in powerlifting championship for actress Pragathi

Bronze in powerlifting championship for actress Pragathi

టాలీవుడ్ నటి ప్రగతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో అనేక రకాల పాత్రలు చేసింది ఈ బ్యూటీ. హీరో అమ్మగా , లేదా హీరోయిన్ అమ్మగా, అటు హీరో హీరోయిన్ల అక్క పాత్రలలో… ముఖ్యంగా బ్రహ్మానందం భార్యగా చాలా సినిమాలలో నటి ప్రగతి కనిపించారు. ఇక ఇటీవల ఎఫ్ 3 మూవీలో నటి ప్రగతి చేసిన కామెడీ అంత ఇంతా కాదు.

Actress Pragathi Second Marriage With Famous Producer

Actress Pragathi Second Marriage With Famous Producer

అయితే సినిమాలు చేయడమే కాకుండా నటి ప్రగతి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు నటి ప్రగతి. అలాంటి నటి ప్రగతి తాజాగా కాంస్య పతకం గెలిచారని సమాచారం అందుతుంది. నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఈ పతకాన్ని నటి ప్రగతి గెలిచారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన నెట్టిజెన్స్…. ఆంటీ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading