పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారుండరు. అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం BRO The Movie. తమిళంలో భారీ విజయం అందుకున్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు.
Advertisement
కథ మరియు వివరణ :
బ్రో సినిమా కథ విషయానికి వస్తే… మార్కండేయులు (సాయిధరమ్ తేజ్) అనే బిజీ పర్సన్ చుట్టూ తిరుగుతుంది. మార్కండేయ చిన్న వయసులోనే తండ్రి చనిపోతారు. మార్కండేయకి ఇద్దరు చెల్లెలు అలానే ఒక తమ్ముడు ఉంటారు. ఇక తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అన్ని అతనే చూసుకుంటారు. ఇక తాను ఉన్న బిజీ షెడ్యూల్ లో అందరి దగ్గర నాకు టైం లేదు టైం లేదు అని చెబుతూ ఉంటారు. అతనికి ఇంట్లో, పని చేసే చోట మంచి పేరు, మర్యాదలు ఉంటాయి. కానీ ఒకరోజు అతను కారులో వెళుతుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అప్పటికప్పుడే చనిపోతాడు.
Advertisement
చనిపోయిన సాయి ధరమ్ కు అప్పుడే దేవుడు లాంటి ‘కాలం’ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తాడు. మార్కండేయ చనిపోయిన తర్వాత కూడా కొన్ని కండిషన్లు పెట్టి 90 రోజుల జీవితాన్ని ప్రసాదిస్తాడు. అయితే… మార్కండేయులుకు పవన్ కళ్యాణ్ ఎలా సహాయం చేస్తారు? దాంతో మార్కండేయులు ఎలాంటి లబ్ధి పొందుతాడనేది సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ కొంత బోర్ కొట్టే విధంగా ఉందని… అయితే పవన్ కళ్యాణ్ ఎంతో అందరిలో ఉత్సాహం వస్తుందని… సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని తెలుస్తోంది. వివిధ గెటప్ లలో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ… తన అభిమానులకి నోస్టాల్జిక్ ఫీల్ ను కలిగిస్తుందని తెలుస్తోంది. ఓవరాల్ గా కర్మ సిద్ధాంతం అనే మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందిందని చెప్పవచ్చు.
పాజిటివ్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్
సాయి ధరమ్ తేజ్
కథ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నెగిటివ్ పాయింట్స్ :
స్లో నేరేషన్
రేటింగ్ : 3/5
ఇవి కూడా చదవండి
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?