టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత ఇమేజ్ ఉందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. సినిమా టాక్ ఎలా ఉన్న ఫస్ట్ రెండు, మూడు రోజులు థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ అవ్వడం మాత్రం పక్కా అనే చెప్పాలి. తాజాగా ఇవాళ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ BRO థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. తమిళంలో తెరకెక్కిన వినోదయ సీతమ్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ నటన అద్భుతం అనే చెప్పాలి.
Advertisement
ముఖ్యంగా ఈ సినిమాలో పాలిటిక్స్ కి సంబంధించిన డైలాగ్ లు ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ వాస్తవానికి సినిమా, పాలిటిక్స్ వేరు కాదు. ఎప్పటి నుంచో రాజకీయాలను సినిమాలతో విమర్శించే సాంప్రదాయం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తన ప్రతీ సినిమాలో కూడా పొలిటికల్ డైలాగ్ లను ఉండేవిధంగా చూసుకుంటారు. జనసేన ఇమేజ్ ని పెంచేవిధంగా డైలాగ్స్ రాస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఏపీ ప్రభుత్వాన్ని సైతం విమర్శిస్తున్నారు. భీమ్లానాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ లను వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు.
Advertisement
బ్రో సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి చురకలు వేసినట్టు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కోసం ప్రత్యేకంగా డైలాగ్ లు రాసాడట. ఇవి పవన్ నోటి నుంచి ఓ రేంజ్ లో పేలాయి. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ ఓ సీన్ లో టీ గ్లాస్ ని ఉద్దేశిస్తూ.. ఏంటి నీ చేతికి ఆ గాజు గ్లాస్ రావాలి. అంతేగా అంటున్నాడట. కేవలం అది గాజు గ్లాసు మాత్రమే కాదు.. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను మార్చే ఆయుధం అంటాడు. అదేవిధంగా మన జీవితం, మరణం భావితరాల కోసమే.. పుట్టిక మలుపు మరణం గెలుపు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ఫస్టాప్ లో వినోదం కీలకమైతే.. సెకండాఫ్ లో భావోద్వేగాలు చాలా కీలకంగా మారనున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
BRO Review: ‘బ్రో’ సినిమా రివ్యూ.. మామ, అల్లుడు దుమ్ములేపారా ?
కళ్యాణి, సూర్య కిరణ్ లు అందుకే విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సుజిత