ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కావడానికి దాదాపుగా ఇంకా ఏడూ నెలల సమయం అనేది ఉంది. కానీ ఈ సీజన్ లో ఎలాగైనా టైటిల్ అనేది సాధించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటినుండే చర్యలు అనేవి ప్రారంభించింది. అందులో భాగంగానే ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. ఇన్ని రోజులు జట్టు హెడ్ కోచ్ గా ఉన్న టామ్ మూడీని ఆ స్థానం నుండి తొలగిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఇక ఆయన స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్ గా వెస్టిండీస్ వీరుడు బ్రియాన్ లారా ఉండనున్నాడు. అయితే గత ఐపీఎల్ సీజన్ లో బ్రియాన్ లారా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నారు.కానీ ఇప్పుడు ఆయనను హెడ్ కోచ్ గా ప్రమోట్ చేసారు. కానీ ఆయన స్థానం లో బ్యాటింగ్ కోచ్ గా ఎవరు వస్తారు అనేది తెలియదు.
Advertisement
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తీసేసిన టామ్ మూడీ హయంలోనే ఈ జట్టు 2016 లో ఐపీఎల్ టైటిల్ అనేది అందుకుంది. కానీ మధ్యలో 2019, 2020 సీజన్ లలో హెడ్ కోచ్ గా తప్పుకున్న మూడీ మళ్ళీ 2021, 2022 సీజన్ లలో హెడ్ కోచ్ గ ఉన్నారు. అయితే ఈ రెండు సీజన్ లవ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలం కావడంతో ఇప్పుడు ఆయనను ఆ పదవి నుండి తప్పిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.
ఇవి కూడా చదవండి :