తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతుంటారు. కానీ పాలు ఇవ్వడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందనే విషయం తెలుసుకోవాలి. చాలా మంది తల్లులు పాలు ఇవ్వడం వ్యాధి తీవ్ర పెరుగుతుందని, పిల్లలకు ఈ బ్లడ్ షుగర్ వస్తుందనే భయంతో పాలు ఇచ్చేందుకు వెనుకాడుతుంటారు. కానీ వైద్యుల సలహాలు, సూచనలతో పాటు ఈ చిట్కాలు పాటిస్తే పిల్లలు పాలిస్తూ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. బ్రేక్ ఫాస్ట్ తీసుకునే సమయంలో వైద్యుల సలహా పాటించండి.
Advertisement
బ్లడ్ షుగర్ స్థాయి ఆధారంగా టిఫిన్ పాలు ఇవ్వడానికి ముందు తీసుకోవాలా..? తరువాత తీసుకోవాలా అని డాక్టర్లు సూచిస్తుంటారు. మధుమేహంతో బాధపడే తల్లులకు వారి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అవసరం. తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన సమయం ఉండదు. షుగర్ ఉన్న తల్లులు తగిన మోతాదులో నీరు తాగాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడ్డ తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేందుకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక వారిలో ఉన్న అపోహలను తొలగించుకోవడానికి సరైన కౌన్సెలింగ్ పొందాల్సి ఉంటుంది. పిల్లలకు పాలు ఇచ్చే విధానం తెలుసుకోవాలి.
Advertisement
బ్లడ్ షుగర్ ఆధారంగానే ఇన్సులిన్ మోతాదులో తీసుకోవాలి. ఎలాంటి భోజనం తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదనే విషయంపై జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు మేలు ఇచ్చే తల్లులు తప్పనిసరిగా పోషక ఆహారాన్ని తినాలి. మధుమేహం ఉన్న చాలా మంది మహిళలకు పాలిచ్చిన తరువాత బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోవచ్చు. ఆ సమయంలో కొంత మొత్తంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లతోకూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి షుగర్ లెవల్స్ పడిపోతే పిల్లలకు పాలివ్వడానికి ముంఉద అవసరమైతే చిరు తిళ్లు తినడం మంచిది. బయటికి వెళ్లి నప్పుడు తప్పకుండా బ్యాగ్‌లో చిరుతిండ్లు ఏవైనా తీసుకెళ్లాలి. పాలు ఇచ్చిన తరువాత కొంత మంది తల్లులకు దాహంగా కూడా అనిపించవచ్చు. ఈ సమయంలో తక్కువ మోతాదులో నీరు తాగడం బెటర్.
పిల్లలు నిద్ర పోయిన ప్రతి సమయంలో తల్లి కూడా పడుకోవడానికి ప్రయత్నించాలి. దీని ద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. మధుమేహం ఉన్న తల్లులు పాలు ఇచ్చేటప్పుడు కేవలం ఒక రొమ్ము నుంచే కాకుండా రెండింటి నుంచే పాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని ద్వారా పుండ్లు పడకుండా చూసుకోవచ్చు. ఎక్కువగా పుండ్లు వస్తే వైద్యులను సంప్రదించాలి. తల్లి ఎల్లప్పుడూ సంతోషంగా రిలాక్స్ గా ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా తప్పకుండా పాలు ఇచ్చే తల్లుల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read :
Chanakya Niti : మనిషి ఈ విషయాలకు చాలా దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం..!
మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మటుమాయం