Home » హరోంహర అత్తిలి చిరబర.. బ్రహ్మాస్త్ర 2 ఇక లేనట్టేనా ? 

హరోంహర అత్తిలి చిరబర.. బ్రహ్మాస్త్ర 2 ఇక లేనట్టేనా ? 

by Anji
Ad

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, అలీయా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. మరోవైపు వీరిద్దరి రియల్ లైఫ్ కపుల్స్ కావడం విశేషం. దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా విడుదల సమయంలో బాలీవుడ్ మీడియా చేసిన హడావిడి అలాంటిది మరీ.. విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుందని.. ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ ని గుర్తు చేసేవిధంగా బ్రహ్మాస్త్ర మూవీ విడుదలైనప్పుడు భారీగా ప్రమోషన్స్ చేసింది చిత్ర యూనిట్. 

Advertisement

అయితే బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 09, 2022న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముఖ్యంగా ప్రేక్షకుల అభిప్రాయంతో సంబంధం లేకుండా వాళ్లకి వాళ్లే సూపర్ హిట్ మూవీ అంటూ ప్రకటించుకున్నారు. కానీ రియాలిటీలో చూస్తే.. కానీ అసలు విషయం తెలియలేదు. బ్రహ్మాస్త్ర మూవీని కొనుగోలు చేసిన బయ్యర్లతో పాటు నిర్మాత కరణ్ జోహార్ కూడా భారీగానే నష్టపోయారట. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించిందని ప్రేక్షకులను నమ్మించడానికి పెట్టిన ఖర్చులో సగం కంటెంట్ పై పెట్టి ఉంటే.. ఇలా జరిగేది కాదనే విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి. 

Advertisement

ఈ విషయం పక్కకు పెడితే బ్రహ్మాస్త్ర విడుదల కాకముందే ఈ మూవీని మొత్తం మూడు భాగాలుగా విడుదల చేస్తామని దర్శఖుడు అయాన్ ముఖర్జీ ప్రకటించేశాడు. పార్ట్ వన్ క్లైమాక్స్ పార్ట్ 2కి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 రావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా నిర్మాత కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర 2 చేయడానికి అసలు ఆసక్తి చూపించడం లేదట. మళ్లీ వందల కోట్ల బడ్జెట్ పెట్టి బ్రహ్మాస్త్ర చేయడానికి ముందుకు రావడంలేదని టాక్ వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర మూవీని పక్కకు పెట్టి వేరే సినిమాలు చేస్తున్నాడే తప్ప.. బ్రహ్మాస్త్ర 2 గురించి కనీసం ఆలోచించడం కూడా లేదట. ఇక చేసేది ఏమి లేక దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా బ్రహ్మస్త్ర ను పక్కకు పెట్టి వేరే మూవీస్ పై ఫోకస్ చేయనున్నట్టు బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బ్రహ్మాస్త్ర 2 ఆగిపోయినట్టు స్ఫష్టమవుతోంది. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

నా శాపం వల్లనే BRO సినిమా ఫ్లాప్ అయ్యింది – శ్రీ రెడ్డి సంచలనం

Visitors Are Also Reading