ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి దర్శకులలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది శ్రీనువైట్ల మాత్రమే. ఆయన తీసిన సినిమాల్లో ముఖ్యంగా దుబాయ్ శీను, వెంకీ, సొంతం, దూకుడు సినిమాలో సన్నివేశాలు చూసి పగలబడి నవ్వుతారు. అలా కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీనువైట్ల ప్రస్తుతం ప్లాపులతో సతమతమవుతున్నారు. సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటున్నారు.
Advertisement
అయితే ఈ దర్శకుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను కింగ్ చిత్రంలోని బ్రహ్మానందం పాత్రను తయారు చేయడానికి ఆదర్శం ఎవరో చెప్పి అందరికీ షాక్ కు గురి చేశాడు. అయితే చాలామంది కింగ్ చిత్రంలోని బ్రహ్మానందం జయసూర్య పాత్రను చక్రీని ఉద్దేశించి తీశానని అందరూ తప్పు ప్రచారం చేశారు. చక్రి నా “డీ” చిత్రానికి పనిచేశాడు. గొప్ప ప్రతిభ ఉన్న డైరెక్టర్. నేను అతనికి పారితోషకం ఇవ్వలేకపోయినా నా మీద ఇష్టంతో చాలా సినిమాల్లో చేశారు. అలాంటి గొప్ప మనిషిని నేను ఎందుకు తప్పుగా చూపిస్తాను..
Advertisement
నేను ఆ పాత్రను వేరే సంగీత దర్శకుడికి సెటైర్ గా తీశాను. అది మరోలా వెళ్ళింది. ఇండస్ట్రీలోకి అప్పుడే రామజోగయ్య శాస్త్రి వచ్చారు. అతన్నీ నా వెంట తీసుకొని ఒక ప్రముఖ సంగీత దర్శకుడు దగ్గరికి వెళ్లాను. అతనితో మ్యూజిక్ సిట్టింగ్ వేయగానే అరేయ్ శాస్త్రి ఇలా రాయి రా అనగానే నేను షాక్ అయ్యాను. ఏదో తన దగ్గర ఏండ్ల తరబడి పనిచేస్తున్న పనివాడిలాగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు . అందుకే అతనిపై సెటైర్ వేస్తూ జయసూర్య పాత్రను సృష్టించానని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.
also read: