హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషులను,సృష్టిని సృష్టించాడు. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు కనిపించే సరస్వతీదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..చదువుల తల్లిగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతీదేవి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అని మీలో ఎంతమందికి తెలుసు.. నిజంగా బ్రహ్మ కూతురు సరస్వతి దేవి.
బ్రహ్మ కూతురు సరస్వతి దేవిని అతడే పెండ్లాడాడు అంటే ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు. మరి సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..సరస్వతి పురాణం, మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మ తన కూతుర్ని పెళ్లాడాడు అని రాసుంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మ.. సరస్వతి దేవి అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు.
సరస్వతి దేవి ఏ దిక్కున ఉన్న చూడడానికి బ్రహ్మ కు ఐదు తలలు ఉన్నాయట.దాంతో బ్రహ్మ సరస్వతి ని పెళ్లాడి మనిషి జాతిని సృష్టించాలని అనుకున్నాడు. అలా బ్రహ్మ 100 సంవత్సరాల పాటు సరస్వతి ఏకాంతంగా ఉండి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భుమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు.ఇలా మనిషి జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతినే పెళ్లాడాడని అంటారు.
ALSO READ;
శ్రీహరికి తన మరణం గురించి మూడు నెలల ముందే తెలుసా..?
తినేముందు విస్తరి చుట్టూ నీళ్లు చల్లడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఇదేనా..!!