Home » శ్రీకాంత్ కొడుకుతో బాలీవుడ్ బ్యూటీ.. రోషన్ ఈసారి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

శ్రీకాంత్ కొడుకుతో బాలీవుడ్ బ్యూటీ.. రోషన్ ఈసారి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిర్మలా కాన్వెంట్‌`తో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. `పెళ్లిసందడి`తో పూర్తి స్థాయి హీరోగా మారారు. ఇప్పుడు కొంత గ్యాప్‌తో హీరోగా సినిమాలు ప్రకటించారు. ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించడం విశేషం. కానీ ఇతనికి కలిసి రావడం లేదు. అద్భుతంగా నటించగలడు గాని అతని ఎంచుకునే కథలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. లాస్ట్ టైం నటించిన మూవీలో హీరోయిన్గా నటించిన స్త్రీలకు మంచి బ్రేక్ వచ్చింది కానీ హీరోగా నటించిన రోషన్కు మాత్రం బ్రేక్ రాలేదు.

Advertisement

ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు రోషన్. కన్నడ దర్శకుడు నంద కిశోర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకి వృషభ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో మోహన్ లాల్ రోషన్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నట్టు సమాచారం. అంత పెద్ద స్టార్ తో కాంబినేషన్ అంటే భారీ ఎక్స్ పెక్టేషన్స్ తోనే ఉన్నారు ఆడియన్స్. ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఒకే చేశారు. రాజమౌళి దయవల్ల ఇప్పుడు సౌత్ మూవీస్ పై తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు బాలీవుడ్ భామలు. ఇప్పటికే జాన్వీ అలియాభట్ లాంటి వారు తెలుగులో నటించగా తాజాగా కపూర్ వారసురాలు షనాయ కపూర్ ని ఈ మూవీతో తెలుగులో పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

 

 

 

సంజయ్ కపూర్ మహీప్ కపూర్ ల కూతురు షనాయా కపూర్. తనను ఈ వృషభంతో ఆమె టాలీవుడ్ కి పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ మూవీలో ఆమె పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ మూవీలో నటించడానికి డైరెక్టర్ చెప్పిన పాత్ర నచ్చడంతోనే షనాయా ఈ సినిమాలో నటించడానికి ఒకేలా ఉన్నారు. షనాయా కూడా కాస్త చిన్నపిల్లే కావడంతో ..రోషన్ కు కరెక్ట్ గా ఉంటుందని అంటున్నారు మూవీ లవర్స్. మరి ఈ జంట ఎంత వరకు అభిమానులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఈ హీరోలకు తల్లులు వేరైనా.. తండ్రి ఒక్కడే.. ఆ హీరోల లిస్ట్ ఇదే !

సితార ఫస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ ఎంత..? అది ఏం చేసిందో తెలుసా ?

Visitors Are Also Reading